మేనిఫెస్టో.. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది : వినయ్ భాస్కర్

మేనిఫెస్టో.. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది : వినయ్ భాస్కర్

మేనిఫెస్టో అంటే తమకు  భగవద్గీత.. ఖురాన్, బైబిల్ లాంటిదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. తనపై నమ్మకంతో బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ మేనిఫేస్టోలో ఎన్నో పథకాలు అందించామన్నారు. 

అంబేడ్కర్ ఆలోచన విధానంతో అభివృద్ధిలో ముందుకెళ్తున్నామన్నారు  వినయ్ భాస్కర్. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టామని.. భారీ విగ్రహం నెలకొల్పామని తెలిపారు. కరోనా కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో  46 వేల కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు.  సంక్షేమం ఎజెండాగా ముందుకెళ్తామన్నారు.  

ప్రజల్లో లేని నాయకులు ఎన్నికలు రాగానే  వస్తారని.. వరంగల్  పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కష్టకాలంలో అండగా ఉన్నానని చెప్పారు వినయ్ భాస్కర్. ఎడ్యుకేషన్ హబ్ ,ఐటీ హబ్ గా హన్మకొండను తీర్చిదిద్దామని తెలిపారు. మతతత్వ పార్టీని హన్మకొండ ప్రజలు ఆదరించబోరన్నారు. అందరి సలహాలు ,సూచనలు తీసుకుని ప్రజలకు సేవచేస్తానని తెలిపారు.