సైబర్ ​ఫ్రాడ్స్​పై నజర్‌‌‌‌‌‌

V6 Velugu Posted on Oct 15, 2021

‘‘ మెహిదీపట్నంకు చెందిన సుధేశ్​అగర్వాల్‌‌ వ్యాపారి. సెకండ్​హ్యాండ్​బైక్​కొనేందుకు ఓఎల్‌‌ఎక్స్‌‌లో సెర్చ్‌‌ చేశాడు.  లంగర్‌‌‌‌హౌజ్‌‌ అడ్రస్‌‌ తో ఓ బైక్ కనిపించింది. దాని కాస్ట్ రూ.35వేలు​. వెంటనే బైక్‌‌ ఫొటో పెట్టిన వ్యక్తికి కాల్‌‌ చేయగా హిందీలో మాట్లాడాడు. హైదరాబాద్‌‌ నుంచి ట్రాన్స్‌‌ఫర్​అయి గుజరాత్​కు వచ్చానని,  శంషాబాద్​ ఎయిర్‌‌‌‌పోర్ట్ పార్కింగ్‌‌లో బైక్ ఉందని చెప్పి ఫొటోలు పంపించాడు. సుధేశ్​అడ్వాన్స్‌‌గా అతనికి రూ.5 వేలు, ఆ తర్వాత  రూ.25వేలు  చెల్లించాడు.  కాల్ చేస్తే అతడు లిఫ్ట్ చేయడంలేదు. దీంతో బాధితుడు పోలీసులకు కంప్లయింట్​చేశాడు. ’’


“ అమీర్​పేటకు చెందిన ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌ ప్రైవేట్‌‌ ఎంప్లాయ్‌‌. గత శుక్రవారం సాయంత్రం అతనికి ఓ నంబర్​నుంచి కాల్ రాగా, ట్రూ కాలర్‌‌‌‌ ఐడీలో ఎస్‌‌బీఐ ముంబై అని పేరు పడింది. అతడు లిఫ్ట్​చేయగా కాల్‌‌ చేసిన వ్యక్తి బ్యాంక్​హెడ్‌‌ ఆఫీస్‌‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఆర్‌‌‌‌బీఐ గైడ్‌‌లైన్స్ ప్రకారం మీ అకౌండ్​కేవైసీ అప్‌‌డేట్ చేసుకోవాలని సూచించాడు.  బ్యాంక్ అకౌంట్‌‌, డెబిట్‌‌ కార్డ్‌‌‌‌,డేట్‌‌, సీవీవీ,ఓటీపీ నంబర్లకు చెప్పమని అడగడంతో చెప్పాడు. వెంటనే రూ.10 వేలు డ్రా అయినట్లు ప్రవీణ్​కు మెసేజ్‌‌ వచ్చింది. కార్డు బ్లాక్ చేసుకుని ఆ తర్వాత పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ’’ 


హైదరాబాద్‌‌,వెలుగు:  అంతర్ రాష్ట్ర సైబర్ క్రైమ్స్​గ్యాంగ్​లపై సిటీ పోలీసులు ఫోకస్​పెట్టారు. నెల రోజుల్లోనే రాజస్థాన్, జాంతార, దేవ్‌‌ఘర్‌‌‌‌, యూపీ, వెస్ట్‌‌ బెంగాల్‌‌ ప్రాంతాలకు చెందిన 35 మందిని మూడు కమిషనరేట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో వారిచ్చిన వివరాల ఆధారంగా ఓఎల్‌‌ఎక్స్,ఈ కామర్స్ సైట్స్‌‌, బ్యాంకింగ్‌‌ మోసాల్లోని మాస్టర్‌‌‌‌ మైండ్స్‌‌ను ట్రేస్ చేసేందుకు ఇన్వెస్టిగేషన్​కొనసాగిస్తున్నారు. స్మార్ట్‌‌ ఫోన్స్‌‌ ద్వారా జరిగే  క్రైమ్స్​లో ఎక్కువగా ఫేక్ ట్రూ కాలర్‌‌‌‌నే సైబర్ క్రిమినల్స్​వాడుతుంటారు. ఇలా జార్ఖండ్‌‌లోని జాంతార,  దేవ్‌‌ఘర్‌‌‌‌ గ్యాంగ్‌‌ బ్యాంకింగ్‌‌ సెక్టార్‌‌‌‌ను టార్గెట్‌‌ చేశాయి. జాంతార జిల్లా కరంతాడ్‌‌ పీఎస్‌‌ లిమిట్స్‌‌లోని ఒక్కో గ్రామంలో నివసించే 300 కుటుంబాల్లో  సుమారు 200 కుటుంబాలు బ్యాంక్‌‌ ఫ్రాడ్స్‌‌ చేస్తుంటాయి. ఫేక్ అడ్రస్‌‌లతో సిమ్‌‌ కార్డులు కొనుగోలు చేసి  గ్రూప్స్‌‌గా యాక్టివేట్‌‌ చేసుకుంటారు.  కస్టమర్లు ఎక్కువగా ఉన్న బ్యాంకులను టార్గెట్‌‌ చేసుకుని ఆయా బ్యాంకుల మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాంకులకు చెందిన నంబర్స్‌‌తో ఫేక్‌‌ కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ పేర్లు ట్రూకాలర్​ డిస్​ప్లేలో కనిపించే విధంగా పెట్టుకుని ఫ్రాడ్స్​చేస్తున్నారు. 
నంబర్​ ఫీడ్ ​చేసిన వెంటనే..
ఓపెన్‌‌ సోర్స్‌‌ ఇంటెలిజెన్స్‌‌ సైబర్ క్రైమ్ లకు అడ్డాగా మారింది. డేటాలో ఓ నంబర్‌‌‌‌తో  ఫీడ్‌‌ చేసిన నేమ్‌‌ ట్రూ కాలర్‌‌గా యాక్టివేట్‌‌ అవుతుంది.  ఇలా సిమ్‌‌ కార్డ్‌‌ కాంటాక్ట్‌‌లోని సుమారు10 నుంచి 15 మంది ఫోన్‌‌ నంబర్స్‌‌తో కనెక్ట్‌‌  చేయొచ్చు. ట్రూ కాలర్‌‌లో ఎడిట్ చేసినా నేమ్‌‌ ఆటోమెటిక్‌‌గా డిస్​ప్లే అవుతుంది. కాల్‌‌ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్‌‌ కట్​చేసినా కూడా ట్రూ కాలర్‌‌ లో పేరు పడుతుంది. ఇలా  సైబర్ గ్యాంగ్స్‌‌ తమ గ్రూపుల్లోని కాంటాక్ట్‌‌ లిస్ట్‌‌తో యాడ్ చేస్తూ,  ఒక్కో గ్రూప్‌‌లోని10 మందికి ఫేక్ ట్రూ కాలర్స్‌‌ యాక్టివేట్‌‌ చేస్తారు. అనంతరం క్రియేట్‌‌ చేసిన నంబర్స్‌‌తో బ్యాంక్‌‌ నుంచి కాల్స్‌‌ చేస్తున్నట్లు అవతలి వ్యక్తికి ఫోన్లు చేస్తారు. 
ఫేక్ ట్రూ కాలర్స్‌‌తో ట్రాప్‌‌  
ఫేక్ ట్రూ కాలర్ కాల్స్‌‌ రిసీవ్ చేసుకునే బాధితులు నిజమైన బ్యాంక్‌‌ కాల్‌‌గా భావించి, సైబర్‌‌‌‌ క్రిమినల్స్​అడిగే బ్యాంక్​అకౌంట్‌‌ నంబర్‌‌‌‌, ఏటీఎం, సీవీవీ, ఓటీపీ నంబర్స్‌‌ను చెప్పేస్తుంటారు. ఎక్కువగా కేవైసీ, అకౌంట్‌‌, డెబిట్‌‌ కార్డ్‌‌ అప్‌‌డేట్‌‌ పేరుతో సైబర్ క్రిమినల్స్​ ఫోన్లు చేసి అకౌంట్స్ లోని అమౌంట్​ఖాళీ చేస్తున్నారు. అరెస్టైన నిందితుల నుంచి ఆధారాలు సేకరించి వారి వెనక కింగ్‌‌పిన్స్‌‌ ఎవరనేది పోలీసులు గుర్తిస్తుంటారు. 


సైబర్​క్రైమ్స్​పై అవగాహన పెంచాలె
ఇతర రాష్ట్రాల నుంచే సైబర్ ముఠాలు ఫ్రాడ్స్ చేస్తున్నాయి. చాలావరకు చదువుకోని వారే సైబర్ నేరాల్లో ఎక్స్‌‌పర్ట్స్ ఉంటున్నారు. కేసుల్లో నిందితులను అరెస్ట్‌‌ చేసి విచారిస్తున్నాం. ఓఎల్‌‌ఎక్స్‌‌, ఓటీపీ క్రైమ్స్​పై జనాల్లో అవగాహన వచ్చింది. దీంతో ఓఎల్‌‌ఎక్స్ ఫ్రాడ్స్ కొంతవరకు తగ్గాయి. అయితే సైబర్ నేరాలపై ఇంకా అవగాహన పెంచాల్సి ఉంది. 
                                                                                                                                                                                    ‑ కేవీఎం ప్రసాద్, ఏసీపీ,సైబర్‌‌ క్రైమ్,హైదరాబాద్‌‌‌‌

Tagged Hyderabad, POLICE, frauds, Cyber,

Latest Videos

Subscribe Now

More News