సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాల్వకు సోమవారం ఆఫీసర్లు నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఎన్నెస్పీ ఆఫీసర్లు చెప్పారు. ఈ నీటితో నల్గొండ జిల్లాలోని పెద్దదేవులపల్లి, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను నింపనున్నట్లు తెలిపారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ఆఫీసర్లు సూచించారు.