ప్రజలు కాంగ్రెస్‌‌ను ప్రత్యామ్నాయంగా భావించట్లేదు

ప్రజలు కాంగ్రెస్‌‌ను ప్రత్యామ్నాయంగా  భావించట్లేదు

న్యూఢిల్లీ: బిహార్‌‌లో ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ కల నెరవేరలేదు. కేవలం 19 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ తీవ్రంగా నిరాశపర్చింది. బిహార్ ఎలక్షన్ రిజల్ట్స్‌‌పై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు భావించడం లేదన్నారు. బిహార్‌‌లో ఆర్జేడీనే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

‘కాంగ్రెస్‌‌ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నా లాంటి కొందరు సీనియర్లం కలసి అధిష్టానానికి లేఖలు అందించాం. అయితే మా సూచనలను వాళ్లు పట్టించుకుపోగా.. మాకే అడ్డం తిరిగారు. దీని ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి. దేశ ప్రజలు బిహార్‌‌లోనే గాక ఉప ఎన్నికలు జరిగిన ప్రతి చోటా కాంగ్రెస్‌‌ను ప్రత్యామ్నాయ పార్టీగా పరిగణించడం లేదు. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. కాంగ్రెస్‌‌లో జరుగుతున్న తప్పులేంటో మాకు తెలుసు. సంస్థాగతంగా జరుగుతున్న తప్పులను ఎలా సరిదిద్దాలో మాకు తెలుసు. పార్టీ అధిష్టానానికీ సమాధానాలు తెలుసు. కానీ వాటిని సరిదిద్దడానికి పార్టీ పూనుకోవడం లేదు. అందుకే పార్టీ గ్రాఫ్ క్రమంగా కిందకు పడిపోతోంది’ అని సిబాల్ పేర్కొన్నారు.