ప్రాణాలను పణంగా పెట్టి సర్వీస్ చేస్తుంటే ఇచ్చే గుర్తింపు ఇదా?

ప్రాణాలను పణంగా పెట్టి సర్వీస్ చేస్తుంటే ఇచ్చే గుర్తింపు ఇదా?
  • సూపర్​ స్ప్రెడర్స్​ కాదు.. రిస్క్​ టేకర్స్​
  • సర్కారు తమను ‘సూపర్‌ స్ప్రెడర్లు’అనడంపై హైరిస్క్ గ్రూప్ ఆవేదన
  • మమ్మల్ని కరోనా బాధితులుగా గుర్తించాలి.. 
  • వైరస్ వ్యాప్తికి మేమే కారకులం అన్నట్టు వ్యవహరించడం దారుణం
  • ‘సూపర్ స్ప్రెడర్’పేరును వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు

హైదరాబాద్‌, వెలుగు: ‘‘మేం సూపర్ స్ర్పెడర్లం కాదు. హైరిస్క్ టేకర్స్. వైరస్​ను జనాలకు పంచుతలేం. ఎక్కడికీ మోసుకుపోతలేం. కరోనా ప్రమాదం ఉన్నా పని చేస్తున్నాం. జనానికి సర్వీసులు అందిస్తున్నం”అని హైరిస్క్ గ్రూప్​లోని వాళ్లు అంటున్నారు. కరోనా కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తుంటే ప్రభుత్వం తమను సూపర్‌ స్ప్రెడర్లుగా పేర్కొనడం సరికాదని అంటున్నారు. కరోనా ‘సూపర్‌ స్ప్రెడర్ల’కు శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడం తమను బాధిస్తోందని వాపోతున్నారు. హైరిస్క్ బాధితులుగా గుర్తించాల్సింది పోయి, కరోనా వ్యాప్తికి తామే కారకులం అన్నట్టుగా సూపర్‌ స్ప్రెడర్స్‌ అని వ్యవహరించడం దారుణమని అంటున్నారు. కరోనా సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేంజరస్ గా ఉన్నా ప్రాణాలకు తెగించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టి పనులు చేస్తుంటే ప్రభుత్వం తమకు ఇస్తున్న ‘గుర్తింపు’ఆవేదన కలిగిస్తోందని వాపోతున్నారు.

ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నం
ఆటో, క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవర్లు, కూరగాయలు, పూలు, పండ్ల విక్రేతలు, చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మేవారు, మద్యం షాపుల్లో పనిచేసేవాళ్లు, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ డెలివరీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంకుల సిబ్బంది, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీలర్లు, ఎరువుల దుకాణాల్లో పనిచేసేవాళ్లు, అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ కేటగిరీల్లో 7.75 లక్షల మంది ఉన్నారని గుర్తించింది. మూడు రోజుల్లో వీరందరికీ వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న వీరిని డాక్టర్లు సైతం హైరిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారే వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యాప్తి చేస్తున్నట్టు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లుగా పేరు పెట్టింది. ఆ మేరకే కేటగిరైజేషన్ చేసింది. కరోనా బాధితుల వద్దకు వెళ్లి, వారిని హాస్పిటళ్లు, డయగ్నోస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లకు చేరవేస్తూ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న తమను వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లు అని ఎట్లా అంటారని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర సరకులు అమ్ముతూ వచ్చిపోయే జనంతో తాము రిస్క్ ఫేస్ చేస్తున్నామని కూరగాయలు అమ్మేవాళ్లు బాధపడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో పని చేసే స్టాఫ్, గ్యాస్ డెలివరీ సిబ్బంది కూడా ఇలాగే ఫీలవుతున్నారు. సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లు అనే పదం విత్ డ్రా చేసుకుని, హైరిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీగా పిలవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

జర్నలిస్టులకే రూల్స్ ఎందుకు?
జర్నలిస్టులను ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారియర్లుగా గుర్తించమని కరోనా ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటే ప్రభుత్వం సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లుగా గుర్తింపునిచ్చింది. లాక్‌డౌన్ టైమ్‌లో ఎసెన్షియల్ సర్వీసులతోపాటు తమకు ప్రభుత్వం పని చేసేందుకు మినహాయింపు ఇచ్చిందని, సర్కారు వార్తల్ని, కరోనా కవరేజీని చేసే తమను స్ర్పెడర్లు అనడం ఎంత వరకు కరెక్టని జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు. ఈ కేటగిరీలో అక్రిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు ఉన్న 20 వేల మంది జర్నలిస్టులకు మాత్రమే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తామని సర్కారు చెప్పింది. ‘సూపర్ స్ర్పెడర్ల’లో ఇతరుల నుంచి ఐడీ కార్డులు డిమాండ్ చేయని ప్రభుత్వం.. తమకే ఎందుకు రూల్స్ పెట్టిందని విలేకర్లు ప్రశ్నిస్తున్నారు. కుటుంబాలను రిస్క్ లో పెట్టి హాస్పిటళ్ల చుట్టూ తిరిగి కరోనా గురించి జనాలకు సమాచారం చేరవేస్తే తమకిచ్చే విలువ ఇదేనా అని నిలదీస్తున్నారు.

ప్రాణాలకు తెగించి పన్జేస్తున్నం
క్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటోల్లో నిత్యం కరోనా పేషెంట్లు, ప్రజలను హాస్పిటళ్లు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రాణాల కు తెగించి మేం పని చేస్తుంటే ప్రభుత్వం మమ్మల్ని సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లు అనడం అవమానకరంగా ఉంది. మమ్మల్ని ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించాలి. సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లు అనే పేరు వెనక్కి తీసుకోవాలి.
- షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సలావుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ గిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాం వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌


ఎంతోమంది చనిపోయిన్రు
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా ఇంటింటికీ వెళ్లి గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న మా వాళ్లను ప్రభుత్వం సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లు అంటోంది. మేం స్ప్రెడర్లం కాదు.. ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారియర్లం. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశవ్యాప్తంగా 45 మంది డిస్ట్రిబ్యూటర్లు, 75 మంది సిబ్బంది, చాలామంది ఆఫీసర్లు చనిపోయారు. సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలాది మంది వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బారిన పడ్డారు. మాకు వ్యాక్సిన్లు వేయాలని మూడు నెలల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 60 వరకు అర్జీలు పెట్టాం. మాకు వ్యాక్సిన్లు వేయకపోతే గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేమని చెప్పిన తర్వాత ప్రభుత్వం స్పందించింది.
- పింగళి వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అధ్యక్షుడు, ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా