ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: అధికార టీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు చేసినా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపే గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌‌‌పాల్‌‌‌‌ సూర్యనారాయణ చెప్పారు. జిల్లాకు చెందిన లీడర్లతో బుధవారం ఆయన ఉప ఎన్నికల ప్రచారం కోసం మునుగోడుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇతర పార్టీల లీడర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ అభ్యర్థి రాజగోపాల్‌‌‌‌రెడ్డిని గెలిపిస్తాయన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు, బీజేపీ నేతలు ఉన్నారు.

అంగన్‌‌వాడీలు ఐక్యంగా ఉద్యమించాలి

భీంగల్, వెలుగు: కొత్త జాతీయ విద్యా విధానం నుంచి ఐసీడీఎస్‌‌ను మినహాయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌‌బాబు డిమాండ్ చేశారు. బుధవారం భీంగల్‌‌లో జరిగి తెలంగాణ అంగన్‌‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కొత్త జాతీయ విద్యా విధానంతో అంగన్‌‌వాడీ ఉద్యోగుల భద్రతకే ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నదన్నారు. అంగన్‌‌వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన ప్రాజెక్టు కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా కె.దేవగంగు, ఉపాధ్యక్షులుగా జ్యోతి, లక్ష్మి, చంద్రకళ, ప్రధాన కార్యదర్శిగా యమునా, సహాయ కార్యదర్శులుగా భాగ్య వసంత, స్వరూపను ఎన్నుకున్నారు.

కామారెడ్డిలో క్లీన్ ఇండియా

కామారెడ్డి, వెలుగు: క్లీన్ ఇండియా క్యాంపెయిన్ ప్రోగ్రామ్‌‌–2 లో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాలేజీ స్టూడెంట్లు శ్రమదానం చేశారు. బస్టాండ్‌‌,  రైల్వేస్టేషన్, కాలేజీ ఏరియాల పరిసరాల్లోని   ముళ్లపొదలు, గడ్డిని తొలగించారు. సాందీపని డిగ్రీ కాలేజీ ఎన్ఎన్ఎస్ స్టూడెంట్లతో పాటు ప్రిన్సిపాల్​  సాయిబాబు, ఎన్ఎస్ఎస్ ఇన్‌‌చార్జి శంకర్ పాల్గొన్నారు. ఎస్ఆర్‌‌‌‌కే డిగ్రీ కాలేజీ స్టూడెంట్లు పార్కులో శ్రమదానం చేశారు.  కాలేజీ కరస్పాండెంట్​జైపాల్‌‌రెడ్డి, చైర్మన్ భాస్కర్‌‌‌‌రావు, ప్రిన్సిపాల్ దత్తాత్రి, మధుసూదన్‌‌రెడ్డి, నరేశ్‌‌, తిరుపత్తి రెడ్డి పాల్గొన్నారు. 

మనది దేశంలోనే బెస్ట్ పోలీసింగ్

కోటగిరి, వెలుగు: దేశంలోనే బెస్ట్ పోలీసింగ్ మనదేనని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కోటగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, కోటగిరి జడ్పీహెచ్‌‌‌‌ఎస్ స్టూడెంట్లకు పర్సనాలిటీ డెవలప్‌‌‌‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం నిర్మాణాత్మకమైన మార్పులను తీసుకువచ్చిందన్నారు.  తాను 30 రాష్ట్రాల్లో పనిచేసినట్లు చెబుతూ.. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ పోలీసింగే బెస్ట్ పోలీసింగ్ అన్నారు. మహిళలు, ఆడపిల్లల రక్షణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ సందర్భంగా ఏసీపీని హెచ్‌‌‌‌ఎం శాలువా పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో రుద్రూర్ సీఐ జాన్‌‌‌‌రెడ్డి, కోటగిరి ఎస్సై మచ్చేందర్‌‌రెడ్డి, హెచ్‌‌‌‌ఎం గాలప్ప, పీడీ సాయిబాబా, లెక్చరర్ ప్రమోద్ పాల్గొన్నారు.

కిసాన్ ఈ కేవైసీపై అవగాహన

బాల్కొండ, వెలుగు: రైతులంతా పీఎం కిసాన్ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని బోదేపల్లిలో ఈ కేవైసీపై అవగాహన కల్పించారు. పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులంతా తప్పనిసరిగా ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలన్నారు. మండలంలో 2,941 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 2,217 మంది ఈ కేవైసీ చేయించుకున్నారన్నారు. మిగతా 724 రైతులు వచ్చే వారం రోజుల్లోగా పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో  బోదెపల్లి రైతు బంధు కోఆర్డినేటర్ సామ గంగాధర్, ఏఈవో నిహారిక, జీపీ సెక్రటరీ వనిత, సామ మల్లారెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.

రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

నిజంసాగర్, వెలుగు: వచ్చే నెల మొదటి వారంలో కామారెడ్డి జిల్లాలో జరిగే రాహుల్‌ గాంధీ పాదయాత్ర రూట్​ మ్యాప్‌ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ బుధవారం పరిశీలించారు. జుక్కల్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. సంగారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే యాత్ర కోసం  నిజాంసాగర్ ​మండలం నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా నుంచి హైవే వెంట పిట్లం వరకు రూట్ మ్యాప్​ పరిశీలించారు. యాత్రకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానిక లీడర్లకు సూచనలు చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి షబ్బీర్​అలీ, మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు ఉన్నారు.  

15 నాటికి పనులు పూర్తి చేయాలి

చిన్నాపూర్ అర్బన్ పార్కును సందర్శించిన కలెక్టర్ 

మాక్లూర్, వెలుగు: చిన్నాపూర్ అర్బన్ పార్క్‌‌‌‌లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశంచారు. బుధవారం ఆయన అర్బన్ పార్క్‌‌‌‌లోని ఓపెన్ జిమ్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. నవంబర్ 15 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని తహసీల్దార్ శంకర్‌‌‌‌‌‌‌‌కు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్‌‌‌‌డీవో భవానీ శంకర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారిణి సౌమ్య, స్థానిక సర్పంచ్ లక్మి, ఎంపీడీవో క్రాంతి తదితరులు ఉన్నారు.

855 ఎకరాల్లో ఆయిల్ పామ్‌‌ సాగు

కామారెడ్డి , వెలుగు: జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్​పామ్ సాగు చేపట్టనున్నట్లు కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్​ పేర్కొన్నారు. బుధవారం ఆయిల్ పామ్ సాగుపై  సంబంధిత ఆఫీసర్లలో మీటింగ్‌‌ నిర్వహించారు. అయిల్ పామ్​సాగు చేసే భూముల్లో ఈనెల 31లోగా డ్రిప్ ఇరిగేషన్​ సౌకర్యం కల్పించాలన్నారు.  సాగుపై రైతులకు మరింత అవగాహన పెంచాలన్నారు.  

నేడు ధరణి టౌన్​షిప్‌‌పై మీటింగ్​

కామారెడ్డి టౌన్ పరిధిలోని అడ్లూర్​శివారులోని ధరణి టౌన్ షిప్‌‌లో ఇండ్లు, ప్లాట్ల అమ్మకంపై గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌‌లో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ జితేష్ వి పాటిల్ తెలిపారు.