మానవతా దృక్పథంతో సాయం చేయండి

మానవతా దృక్పథంతో సాయం చేయండి

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ భారత సాయం కోరింది. శాంతిని కోరుకునే భారత్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, యుద్ధం ఆపేందుకు ప్రధాని మోడీ కృషి చేయాలని భారత్ లో ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పొలిఖా కోరారు. ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానుల్లో ఒకరైన మోడీ.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను ప్రభావితం చేయగలరని ఆశాభావం వ్యక్తంచేశారు. మానవీయ కోణంలో ఉక్రెయిన్ కు సాయం చేయండని అభ్యర్థించారు. తాను ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత పౌరులతో ఎప్పటి కప్పుడు మాట్లాడుతున్నానని ఇగోర్ పొలిఖా చెప్పారు. 

ఉక్రెయిన్‌లో పరిస్థితి చేయిదాటిపోకుండా భారత్ సాయం చేయాలని ఇగోర్ పొలిఖా కోరారు. ప్రపంచంలో శాంతి తీసుకొచ్చే సత్తా భారత్‌కే ఉందని అన్నారు. ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయ విద్యార్ధులున్నారని, వారిలో కొందరు యుద్ధం కారణంగా చిక్కుకుపోయారని వెల్లడించారు.