గూగుల్‌‌ మ్యాప్స్‌‌ ఇట్ల కూడా వాడొచ్చు

గూగుల్‌‌ మ్యాప్స్‌‌ ఇట్ల కూడా వాడొచ్చు

ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్‌‌ఫోన్‌‌ ఉంటే చాలు.. గూగుల్‌‌ మ్యాప్స్‌‌ చూసుకుంటూ ఏ కొత్త ప్రదేశానికైనా వెళ్లొచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో గూగుల్‌‌ మ్యాప్స్‌‌ వాడే ఉంటారు. అయితే, ఇందులో ఎక్కువగా రెండు, మూడు ఫీచర్స్‌‌ మాత్రమే వాడుకుంటారు. కానీ, సరైన అవగాహన ఉంటే, మరిన్ని రకాలుగా దీన్ని వాడేయొచ్చు. గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో ఉన్న ఇంట్రెస్టింగ్‌‌ ఫీచర్స్‌‌ ఇవి.

ఇంటర్నెట్‌‌ యాక్సెస్‌‌ లేనప్పుడు ఆఫ్‌‌లైన్‌‌లో కూడా గూగుల్‌‌ మ్యాప్స్‌‌ను వాడుకోవచ్చు. ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు మధ్యలో నెట్‌‌ యాక్సెస్‌‌ లేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆఫ్‌‌లైన్‌‌ ఫీచర్‌‌‌‌ ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగానే రూట్‌‌మ్యాప్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకుని పెట్టుకోవాలి. మెను లెఫ్ట్‌‌ సైడ్‌‌ స్వైప్‌‌ చేసి, కిందివైపు కనిపించే డౌన్‌‌లోడ్‌‌పై ట్యాప్‌‌ చేయాలి. మొబైల్‌‌లో తగినంత స్పేస్‌‌ ఉండాలి. తర్వాత నెట్‌‌తో సంబంధం లేకుండా గూగుల్‌‌ మ్యాప్స్‌‌ యూజ్‌‌ చేసుకోవచ్చు.

స్మార్ట్‌‌ఫోన్‌‌ చూడకుండా కూడా ‘గూగుల్‌‌ మ్యాప్స్‌‌’ వాడుకోవచ్చు. వాయిస్‌‌ కమాండ్‌‌ ద్వారా యాప్‌‌ను యాక్సెస్‌‌ చేయొచ్చు. ‘ఓకే గూగుల్‌‌’ అన్న తర్వాత మీకు కావాల్సిన డెస్టినేషన్‌‌ సెలక్ట్‌‌ చేస్తే, దానికి తగిన డైరెక్షన్స్‌‌ ఇస్తుంది. కేవలం రూట్‌‌మ్యాప్‌‌ చెప్పడమే కాదు.. ‘ట్రాఫిక్‌‌ ఎలా ఉంది?’, ‘డెస్టినేషన్‌‌ రీచ్‌‌ అయ్యేందుకు ఎంత టైమ్‌‌ పడుతుంది’ వంటివి కూడా వాయిస్‌‌ కమాండ్‌‌తో అడగొచ్చు.

మీరు ఎలాంటి వెహికల్‌‌లో వెళ్తున్నారో దానికి సంబంధించిన ఐకాన్‌‌ను సెలక్ట్‌‌ చేసుకోవచ్చు. కార్‌‌‌‌, ట్రక్‌‌, ఎస్‌‌యూవీ, సెడాన్‌‌.. ఇలా మీ ఐకాన్‌‌ను సెలక్ట్‌‌ చేసుకుంటే, దానికి సంబంధించిన నావిగేషన్‌‌ను చూపిస్తుంది.

మల్టీపుల్‌‌ డెస్టినేషన్స్‌‌ కూడా ఒకేసారి సెలక్ట్‌‌ చేసుకోవచ్చు. ట్రావెల్‌‌ చేస్తున్నప్పుడు మధ్యలో షాపింగ్‌‌, లంచ్‌‌, ఇతర పనుల కోసం ‘యాడ్‌‌ స్టాప్’ అని సెలక్ట్‌‌ చేసుకోవచ్చు. ఆ ప్లేస్‌‌లో ఎంతసేపు ఉండాలో, ఎప్పుడు వెళ్లాలో గుర్తుచేసేలా రిమైండర్‌‌‌‌ కూడా పెట్టుకోవచ్చు.

పార్కింగ్‌‌ ప్లేస్‌‌ను కూడా సేవ్‌‌ చేసుకోవచ్చు. క్రౌడ్‌‌ ఉండే ప్లేస్‌‌లో వెహికిల్‌‌ ఎక్కడ పార్క్‌‌ చేశారో కొన్నిసార్లు కనుక్కోవడం కష్టం. అయితే, మీరున్నచోట గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో కనిపించే బ్లూడాట్‌‌పై ట్యాప్‌‌ చేసి, పార్కింగ్‌‌ ప్లేస్‌‌ను సేవ్‌‌ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఫొటో కూడా తీసిపెట్టుకోవచ్చు. తర్వాత కావాల్సినప్పుడు మ్యాప్‌‌ ఓపెన్‌‌ చేసుకుని, పార్కింగ్‌‌ ప్లేస్‌‌కు ఈజీగా వెళ్లొచ్చు.

గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో హిస్టరీ అవసరం లేదను కుంటే ఎప్పటికప్పుడు డిలీట్‌‌ చేయొచ్చు. ఆటో డిలీట్‌‌ ఆప్షన్‌‌ కూడా ఉంది.

కొత్త ప్లేస్‌‌కు వెళ్లినప్పుడు అక్కడికి దగ్గర్లో ఉన్న పెట్రోల్‌‌ బంక్‌‌లు, హాస్పిటల్స్‌‌, రెస్టారెంట్స్‌‌, సినిమా హాల్స్‌‌, ఎలక్ట్రిక్‌‌ వెహికల్‌‌ చార్జింగ్‌‌ స్టేషన్స్‌‌ వంటివి ‘గూగుల్‌‌ మ్యాప్స్‌‌’ ద్వారా కనుక్కోవచ్చు.

ఇవి కూడా చదవండి

మొక్కకు ఈ బాక్సు పెడితే.. నెలకు రెండు సార్లు నీళ్లు పోస్తే చాలు

కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు