వినోదంతో పాటు సందేశమిచ్చే గుణశేఖర్ యుఫోరియా సినిమా

వినోదంతో పాటు సందేశమిచ్చే గుణశేఖర్ యుఫోరియా సినిమా

భూమిక ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన చిత్రం ‘యుఫోరియా’. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. మత్తు పదార్థాలతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తూ, యూత్‌‌‌‌‌‌‌‌ను సరైన మార్గంలో పెట్టే ఇలాంటి సందేశాత్మక చిత్రాలే ప్రస్తుత సమాజానికి అవసరమని అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐపీఎస్ శంఖ బ్రాతా భక్షి అన్నారు. 

దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ ‘పట్టరాని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహమే ‘యుఫోరియా’. ఆ ఆనందంలో మనల్ని మనం అదుపు చేసుకోలేక అదుపు తప్పితే జీవితమే నాశనం అవుతుంది. అలాగే పేరెంటింగ్ సరిగ్గా లేక పిల్లలు పెడదారి పట్టడం,  తద్వారా సమాజం మీద చెడు ప్రభావం పడటం లాంటి అంశాల చుట్టూ దీన్ని తెరకెక్కించాం. సందేశాత్మక చిత్రమైనా చూడాలని వుంది, ఒక్కడు చిత్రాల్లా కమర్షియల్ ఫార్మట్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తూనే మెసేజ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేలా రూపొందించాం. యూత్ సినిమాయే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉంటుంది’ అని చెప్పారు. 

ఈ చిత్రం తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టాప్‌‌‌‌‌‌‌‌లో నిలుస్తుందని.. పిల్లలు, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారని భూమిక చెప్పారు. ‘ధురంధర్’తో నేషన్ వైడ్‌‌‌‌‌‌‌‌గా ట్రెండ్ అయిన సారా అర్జున్.. ఈ చిత్రంతో తిరిగి అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. నటీనటులు రోనిత్, విఘ్నేష్ గవిరెడ్డి, పృథ్వీరాజ్ అడ్డాల, లిఖిత యలమంచలి పాల్గొన్నారు.