భవిష్యత్తులో ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలో జరగాల్సిందేనని ఇండియా బ్లాక్ తీర్మానించింది. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కలిగించాలంటే పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పునరుద్ఘాటించింది. 2026 సెప్టెంబర్ 30వ తేదీన సర్ ప్రక్రియలో అవకతవకలు, ఎన్నికల కమిషన్ లో విభేదాలు మొదలైన అంశాలపై ఇండియా కూటమి ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంల విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు. ఈవీఎం మెషీన్లను బీజేపీ తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటోందని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు.. హంగ్ ఏర్పడాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా, ఓడించాలన్నా.. తమకు అనుకూలంగా మెషిన్లను వాడుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం ఏర్పడాలంటే బాలట్ ఓట్ల పద్ధతిని పునరుద్ధరించాల్సిందేనని అన్నారు.
ఇండియా కూటమి ఆరు డిమాండ్లు:
- భవిష్యత్తులో సర్ ప్రక్రియకు ముందున్న డేటా ఆధారంగం ఎన్నికలు జరపాలి.
- ఓటరు జాబితా నుంచి తొలగించే ముందు అప్పీల్ యంత్రాంగం ఉండాలి
- పరిపాలనా వైఫల్యాల కారణంగా తొలగించిన ఓటర్లకు రక్షణ,
- బ్యాలెట్ల ద్వారా ఓటింగ్,
- మొదటిసారి ఓటు వేసేవారికి సులభమైన, అందుబాటులో ఉండే ఓటరు నమోదు ప్రక్రియ
- ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పునరుద్ధరణ.
ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ వైఖరిపై ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఈసీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇతర కమిషనర్లు సుక్భీర్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలను బేఖాతరు చేసి ఏకపక్ష నిర్ణయం తీసుకుని బీజేపీకి మేలు చేసిన జ్ఞానేష్ కుమార్ ను తొలగించాల్సిందేనని అన్నారు.
బ్యాలెట్ ఓటింగ్‌కు తిరిగి వెళ్లాలన్న డిమాండ్, ఇండియాలో క్రమంగా ఈవీఎంల పై వ్యతిరేకతలో భాగంగా వస్తున్న ముఖ్యమైన మార్పును సూచిస్తుందన్నారు. 1982లో కేరళలోని పారూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను తొలిసారిగా ఉపయోగించారని ఎన్నికల సంఘం చెబుతోంది. ఆ తర్వాతి సంవత్సరాలలో వాటి వాడకం విస్తరించింది, చివరికి అన్ని ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ల స్థానంలో ఈవీఎంలు వచ్చాయి.
ALSO READ : యుద్ధాలకు తోడైన ఎల్‌నినో: అతిపెద్ద ఆహార సంక్షోభానికి సిద్ధంగా ఉండండి
గత కొన్నేండ్లుగా ఈవీఎంలపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నాం. ఓటర్ల జాబితా అవకతవకలు, ఎన్నికల జాబితాలలో వివరణ లేని మార్పులపై ప్రశ్నలు లేవనెత్తాము. మహాదేవపుర, ఆలంద్, హర్యానా, మహారాష్ట్రలలో ఇది జరిగిందని రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారు. అదే విధంగా ఇండియా గ్రూపులోని పార్టీలన్నీ ఈ విషయంలో ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తాయి. కానీ అయ్యో, అధికార ఎన్డీఏ కూటమి పట్టించుకోలేదని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తి, ఈవీఎంలపై ఆధారాల సమర్పించిన తర్వాత ఎన్నికల సంఘం తదనంతరం ఎస్ఐఆర్‌ను ఆశ్రయించిందని ఖర్గే తెలిపారు. దీంతో బీజేపీకి, ఎన్డీఏ కూటమికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఎన్నికల సంఘంపై మండిపడ్డారు.
