5 రాష్ట్రాల ఎన్నికలపై త్వరలో చర్చిస్తాం

5 రాష్ట్రాల ఎన్నికలపై త్వరలో చర్చిస్తాం
  • సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
  • హైదరాబాద్ లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

హైదరాబాద్: త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల పరిస్థితిపై సీపీఎం కేంద్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కమిటీ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చిస్తామని, అలాగే త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చిస్తామని వివరించారు. పార్టీ 23వ అఖిల భారత మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తామని, మహా సభల రెండు నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తామని వివరించారు. ఈ సమావేశాలకు కేరళ సీఎం పినరయు విజయన్,  త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ తో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు. 

 

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి

ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు

వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతిస్తే 25వేలు ఫైన్

పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన