ఎన్నిసార్లైనా మోదీని కలుస్తాం.. నిధులు రాబడతాం.. తెలంగాణను అభివృద్ది చేస్తాం..

ఎన్నిసార్లైనా మోదీని కలుస్తాం.. నిధులు రాబడతాం.. తెలంగాణను అభివృద్ది చేస్తాం..

ఎన్నికలప్పుడే రాజకీయాలని.. తర్వాత అందరిని కలుపుకొని పోయి.. రాష్ట్ర అభివృద్దికి ... ప్రజాసంక్షేమానికి పాటుపడతామని పస్తాపూర్​ సభలో సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం ఎన్నిసార్లైనా ప్రధాని మోదీని కలుస్తామని.. తెలంగాణకు అవసరమైన ఫండ్స్​ తీసుకొస్తామంటూ.... . చెరువు మీద అలిగితే వాసన మనకే కదా  అంటూ.. ఒకాయన ఫాంహౌస్​ లో పడుకున్నారన్నారు.  నేను మీ కోస్ పనిచేస్తా.. కష్టపడతానని సీఎం రేవంత్​అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం ఉంటేనే అభివృద్ది జరుగుతుందన్నారు. 

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం రూ.5 వేల కోట్లకు పైగా కేటాయించామని చెప్పారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఇంకా  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రూ. 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుఉకు కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు.  మీరు అండగా ఉండండి... ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర, కొండా సురేఖ పాల్గొన్నారు.