
గెలిచిన నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే ఏర్పాటు చేస్తానని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీదనే ఉంటుందని చెప్పారు. రెండు సంవత్సరాలలో పసుపు ధర రూ. 25 వేలు నుండి రూ. 30 వేలు పలుకుతుందని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్ రెడ్డి చెప్పుకోదగ్గ పని ఏమీ చెయ్యలేదని విమర్శించారు. మెట్పల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తాను హిందువుని అని చెప్పుకునే జీవన్ రెడ్డి సీఏఏకు సపోర్ట్ చెయ్యలేదని ఆరోపించారు. అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట అయిపోయింది.. ఇప్పుడు మధుర మిగిలిందని చెప్పారు. ఇప్పుడు కోర్టు ద్వారా మధురలో శ్రీకృష్ణ మందిరాన్ని కట్టడానికి జీవన్ రెడ్డి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. బిజెపికి ఉన్న ఈ సునామీలాంటి వేవ్ లో ఎన్డీఏకు 400 బిజెపికి 370 సీట్లు వస్తాయని చెప్పారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అరవింద్ తెలిపారు.