
పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి పండించే రైతులకు రైతు బంధు నిలిపివేయిస్తామని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి అమ్ముతున్న 150 మందిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆయన తెలిపారు. గంజాయి సాగు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.