
అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదన్న బాధ తనకూ ఉందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్అన్నారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని తెలిపారు. ‘‘మా నాన్న ప్రజాజీవితంలో ఉండటంతో మాతో తక్కువ టైం గడిపే వారు. మా అమ్మను చూసి చాలా నేర్చుకున్న.. నా భార్యకు ఓపిక ఎక్కువ.. నా చెల్లె చాలా డైనమిక్.. మా కుటుంబంలోనే తనంత ధైర్యవంతులు లేరు... కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది.. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తున్నది” అని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన ‘విమెన్ ఆస్క్‌కేటీఆర్’ ఇంటరాక్షన్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌నుంచి ఎదిగిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, కరోనాటైంలో సుచిత్రా ఎల్లా, మహిమ దాట్ల లాంటి వారు గొప్ప సేవలందించారని తెలిపారు.
మాపై దుష్ప్రచారం చేస్తున్నరు
డీప్‌ఫేక్‌తో మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నాయకులకు ప్రమాదమని కేటీఆర్ అన్నారు. డీప్‌ఫేక్‌ను వాడుకొని తమపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సోషల్‌మీడియా ఒక్కోసారి టాక్సిక్గాతయారవుతున్నదని అన్నారు. ప్రతిపక్షాలు సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని, మాట్లాడే హక్కును ఎదుటి వాళ్లను దూషించడానికి వాడుకోకూడదని చెప్పారు. నల్సార్‌తో కలిసి సైబర్‌క్రైమ్ లెజిస్లేషన్ తయారు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మహిళల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్15లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఎజెండా తయారు చేసి ఇస్తే దాన్ని అమలు చేస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రతి ఇంటికి నల్లాలతో మంచినీళ్లు ఇస్తున్నామని, మైనార్టీల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ప్రారంభించామన్నారు. కేసీఆర్ కిట్‌తో హాస్పిటళ్లలో డెలివరీలు 61 శాతం పెరిగాయన్నారు. నెగిటివ్బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ తెస్తున్నామని అన్నారు.
రాజకీయాల్లోకి చదువుకున్నోళ్లు ఇంకా రావాలి
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసని, అయినా వాళ్లు నటిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి చదువుకున్న వారు రావాల్సి ఉందని అన్నారు. గత మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని.. సుల్తాన్పూర్, నందిగామ సహా 4చోట్ల మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.