బలహీనపడిన ఉపరితల ఆవర్తనం..మరో 3 రోజులు వర్షాలు

బలహీనపడిన ఉపరితల ఆవర్తనం..మరో 3 రోజులు వర్షాలు
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంటున్నారు. 

రాగల మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల జాబితాలో.. కొమరం భీం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల్,నిర్మల్ ,కామారెడ్డి, సిద్దిపేట్, జనగాం, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.