వార ఫలాలు ( సౌరమానం) జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు

వార ఫలాలు ( సౌరమానం) జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో ఇతరుల సాయం అర్ధిస్తారు. ఆదాయానికి వారం మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. ప్రయాణాలు చివరిలో వాయిదా. కుటుంబసభ్యుల వ్యవహారశైలి కొంత ఇబ్బంది తేవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగులు విధుల్లో ఏ మాత్రం అలక్ష్యం చేయరాదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత మేర విజయాలు.

వృషభం

కొన్ని వ్యవహారాలు విజయవంతం. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. బంధువులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి లోటు ఉండదు. భవనాలు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు విజయాలు. వ్యాపారులకు మిశ్రమ ఫలాలు. ఉద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు. కళాకారులు, పరిశోధకులు, రచయితలకు పురస్కారాలు లభిస్తాయి.

మిథునం 

ఎటువంటి కార్యం చేపట్టినా విజయవంతం. ఆస్తుల పంపకాలలో నెలకొన్న ప్రతిష్టంభన తొలిగే అవకాశం.స్నేహితులు మీ విజయాలకు సాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. అనుకున్న ఆదాయం లభించి ఖర్చులు అధిగమిస్తారు. భూములు, వాహనాలు కొంటారు.  వ్యాపారులకు సంతోషదాయకం. ఉద్యోగులు ప్రతిభ చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు.

కర్కాటకం 

అనుకున్న కార్యక్రమాలు కొన్ని శ్రమానంతరం పూర్తి. ఏదోవిధంగా సొమ్ము సమకూరే సూచనలు. ఇతరులకు హామీలు ఇచ్చే సందర్భంలో ఆలోచన ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగూ మీకు ఉపయుక్తమవుతుంది. వ్యాపారులకి చివరిలో మరింత అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగులకి మరింత కలిసివస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. వారారంభంలో నిర్ణయాలు మార్చుకుంటారు.

సింహం

వృథా ఖర్చులు. ఆస్తుల విషయంలోనూ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం వద్దు. కొన్ని ప్రధాన కార్యక్రమాలు నెమ్మదించినా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ ఉపయోగపడతాయి. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. ఆదాయానికి మొదట్లో కొంత లోటు ఏర్పడినా తిరిగి పుంజుకుంటారు. వ్యాపారులకు మరింత వెసులుబాట్లు. ఉద్యోగులకు అన్ని విధాల సానుకూలత. రాజకీయవేత్తలు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారాంతంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.

కన్య

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందడుగు వేస్తారు. ప్రతి వ్యవహారంలోనూ నిదానం అవసరం. ఆదాయవ్యయాలు సమానం. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో ప్రతిష్ఠంభన. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారులకు సామాన్యమైన ఫలితాలు. కొంత నిదానంగా ముందుకు సాగాలి. ఉద్యోగులు గందరగోళంలో పడతారు. రాజకీయ, కళాకారులకు ఒత్తిడులు తప్పవు. వారారంభంలో బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొంటారు.

తుల 

అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి. ఆస్తి పంపకాల వంటివి ఫలప్రదం. ఇంటి నిర్మాణాలపైనా దృష్టి పెడతారు.  పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారులు మరింత రాణిస్తారు. ఉద్యోగులకు సహచరుల సాయం అందుతుంది. కళాకారులు, క్రీడాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో సోదరులతో విభేదాలు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.

వృశ్చికం

ఆశయాలు, లక్ష్యాలు నెరవేరేందుకు అనుకూల వాతావరణం. జీవిత భాగస్వామి, సోదరులతో సఖ్యత. ఆస్తుల వివాదాలు ఆశ్చర్యకరంగా పరిష్కారం. రాబడికి లోటు రాకున్నా ఖర్చులు ఎదురవుతాయి. ఒక వ్యక్తితో ఏర్పడిన స్నేహం ఉపయోగపడుతుంది. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారులకి కలిసొచ్చే కాలం. ఉద్యోగులు అనుకున్న విధులు చక్కదిద్దుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మిశ్రమంగా ఉంటుంది.

ధనుస్సు 

వ్యవహారాలను ఇతరుల సాయం లేకుండానే పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు.  వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు ఎవరిపై ఆధారపడకుండా విధినిర్వహణలో ముందడుగు వేస్తారు. కళాకారులు, వైద్యులు, విజయాలు సొంతం చేసుకుంటారు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదిస్తారు.

మకరం

తరచూ దూరప్రయాణాలు. ఆరోగ్యం సహకరించక కొంత ఇబ్బందిపడవచ్చు. పట్టుదల, ధైర్యంతో నెట్టుకొస్తారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. రాబడి, ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులకు శుభదాయకం. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం. కళాకారులు, పారిశ్రామికవేత్తలు, క్రీడా కారులకు ఆకస్మిక విదేశీ యానం. వారారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.

కుంభం

ఇంటికి సంబంధించి వ్యవహారాలన్నీ సజావుగా పూర్తి. ఈతి బాధలు తొలిగి ఊరట చెందుతారు. రాబడి అనూహ్యంగా పెరిగి అవసరాలకు ఆదుకుంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు  సత్తా చాటుకుంటారు. గృహ నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు మొదటి రెండురోజులు ఎదురు ఉండదు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు పురస్కారాలు.

మీనం

ఏ వ్యవహారమైనా విజయవంతంగా పూర్తి. ఆర్థిక వ్యవహారాల్లో లోటు ఉండదు. పలుకుబడి, హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. విద్యార్థులకు విజయాల బాట. ఇంటి నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. మిత్రుని ద్వారా ఊహించని విధంగా సహకారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400