వార ఫలాలు : 16–04–2023 నుంచి 22–04–2023 వరకు

వార ఫలాలు :  16–04–2023 నుంచి 22–04–2023 వరకు

మేషం   :  ముఖ్య కార్యాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. సొంత ఆలోచనలతో విజయాలు సాధిస్తారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం ఎదురైన వ్యతిరేకత నుంచి బయటపడతారు. కుటుంబంలో మీరంటే మరింత ఇష్టపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం తొలగుతుంది.

వృషభరాశి : ఇంతకాలం నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి. అదనపు ఆదాయం. ఒక సమాచారం మీలో మార్పుకు దోహదపడుతుంది. సమాజంలో ప్రత్యేక గౌరవం. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరం.

మిథునరాశి : రాబడి మరింత పెరుగుతుంది. ఆశయ సాధనలో బంధువులు సహకరిస్తారు. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు.

కర్కాటకరాశి : ఆర్థికంగా పుంజుకుంటారు. ఇంతకాలం అనుకూలించని పరిస్థితులు కొంత సానుకూలం. ఆలోచనల అమలులో కుటుంబసభ్యులు సహకారం. కొన్ని  సమస్యలు, వివాదాలు పరిష్కారం. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు ఈతిబాధలు తొలగుతాయి. రావలసిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి.

సింహరాశి : ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడ్డా వాటిని అధిగమించే యత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని సమస్యల పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు.  ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాల్లో కదలికలు. సోదరులతో సఖ్యత. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం రావచ్చు. 

కన్యారాశి :  కార్యజయం. ఆస్తుల వ్యవహారాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆలోచనలకు కార్యరూపం. ప్రముఖుల పరిచయం. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. వాహనసౌఖ్యం. చర్చలు సఫలం. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత వర్గాల ప్రశంసలు.
 

తులారాశి : చేపట్టిన కార్యాల్లో కొంత జాప్యం. ఆదాయం ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి.

వృశ్చిక రాశి :  కొన్ని ఇబ్బందులు అధిగమించేందుకు చేసే యత్నాలు సఫలం. ముఖ్యకార్యాలు నిదానిస్తాయి. ఆదాయం ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. తరచూ ప్రయాణాలు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన మార్పులు ఉండవచ్చు.

ధనూరాశి : ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఇంతకాలం పడిన కష్టాలు తీరతాయి. ఆదాయం కొంత పెరుగుతుంది. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనే వీలుంది. విద్యార్థులు శ్రమపడాల్సిన సమయం. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యల నుంచి విముక్తి.

మకరరాశి : సన్నిహితుల నుంచి ఉపకరించే సమాచారం. అదనపు ఆదాయం. ఖర్చులు అదుపులోకి వస్తాయి. కొన్ని కార్యాలు సజావుగా పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. అనుకోని విధంగా ధన, ఆస్తిలాభాలు కలుగవచ్చు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారుల కృషి ఫలించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

కుంభరాశి : వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అయితే సోదరులు, స్నేహితుల సహాయాలతో ముందుకు సాగుతారు. కొంత ఆలస్యమైనా అనుకున్న రాబడి అందుతుంది. అవసరాలకు లోటు రాదు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తులు కొనుగోలులో తుది ఒప్పందాలు. వాహనాలు కొంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించే సమయం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు.

.మీనరాశి : కొత్త కార్యక్రమాలను చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఇంతవరకూ ఎదురైన వ్యతిరేక పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. రావలసిన నిధులు దక్కి అవసరాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమస్యలు సైతం ఈవారం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.