
మేషం (మార్చి21 – ఏప్రిల్20)
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. మిత్రులతో అకారణ తగాదాలు. కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు. కుటుంబంలో శుభకార్యాలు. పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంపై పునరాలోచన చేస్తారు. ఉద్యోగులు విధుల్లో ఆచితూచి వ్యవహరించండి. పైస్థాయి వారి ఆదేశాలపై అప్రమత్తంగా ఉండండి.
వృషభం (ఏప్రిల్21 – మే21)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు పూర్తి. కష్టాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. అనుకున్న సమయానికి సొమ్ము అందుతుంది. వివాహయత్నాలు సఫలం. వ్యాపారులకు లాభాలు. నూతన భాగస్వాములు చేరతారు. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కవచ్చు. విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.
మిథునం (మే22 – జూన్22)
అనుకున్న కార్యక్రమాలు నిదానంగా పూర్తి. ఆలోచనల అమలులో ఆటంకాలు. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సొమ్ము కోసం పడిన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు జరిగే వీలుంది.
కర్కాటకం (జూన్23 – జూలై23)
క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. కొన్ని సమస్యల పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. శ్రమపడ్డా తగిన ఫలితం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. వ్యాపారాలలో లాభాలకు లోటు రాదు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారులు మరిన్ని బాధ్యతలు పెంచుతారు.
సింహం (జూలై24 – ఆగస్టు22)
ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకున్నంత సొమ్ము అందుతుంది. కుటుంబం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. పైస్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు.
కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్22)
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి. ఆలోచనలు అమలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇళ్లు, వాహనాలు కొనే వీలుంది. అనూహ్యమైన రీతిలో ధనలాభాలు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్ధాలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు మెరుగైన పనివిధానాన్ని కనబర్చి ప్రశంసలు పొందుతారు.
తుల (సెప్టెంబర్23 – అక్టోబర్22)
చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. వాహనాలు, గృహం కొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండుమూడు విధాలుగా ధనలాభ సూచనలు. బంధువులతో సందడిగా గడుపుతారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. నూతన భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.
వృశ్చికం (అక్టోబర్23– నవంబర్22)
మీ ప్రతిపాదనలు మిత్రులు అంగీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొంత సొమ్ము అనుకున్న సమయానికి అందుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రాగల సూచనలు. విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
ధనుస్సు (నవంబర్23 – డిసెంబర్22)
నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. సమయానికి సొమ్ము అందుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. మీపై ఉంచిన బాధ్యతలు పూర్తి చేసి బంధువుల ప్రశంసలు పొందుతారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు గుర్తింపు. ఉన్నతాధికారుల సలహాలు పాటిస్తారు.
మకరం (డిసెంబర్23 – జనవరి22)
కొత్త కార్యక్రమాలు సజావుగా పూర్తి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు. వాహన, గృహయోగాలు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది. మీ ఆలోచనలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పైస్థాయి వారి నుంచి కొంత సాయం అందుతుంది.
కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
కొత్త విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. మీ ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొన్ని సమస్యలు తీరతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. రుణభారాలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని లాభాలు గడిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.
మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
కొన్ని వివాదాల పరిష్కారం. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. సొమ్ముకు లోటు ఉండదు. వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. భాగస్వాములతో వివాదాల పరిష్కారం. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు.