వార ఫలాలు : 2023 జూలై 30 నుంచి ఆగస్టు 05 వరకు

వార ఫలాలు : 2023 జూలై 30 నుంచి ఆగస్టు 05 వరకు

మేషం : వ్యవహారాలు విజయవంతం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి విషయాల్లో బంధువులతో తగాదాల పరిష్కారం. శత్రువులు మిత్రులుగా మారతారు. రావలసిన సొమ్ము అందుతుంది. మీ ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల ఆమోదం. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. విస్తరణ యత్నాలు కలసివస్తాయి. రాజకీయవర్గాల వారు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు.

వృషభం : సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. అరుదైన ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. కుటుంబసమస్యల నుంచి కాస్త ఉపశమనం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల విస్తరణయత్నాలు నెమ్మదిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి ఆశ్చర్యపరుస్తాయి.

మిథునం : ఆకస్మిక ప్రయాణాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి.ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. శ్రమకు ఫలితం ఉండదు. మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు. వారారంభంలో బాకీలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

కర్కాటకం : పనుల్లో విజయం. సన్నిహితులు దగ్గరవుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. పట్టుదల, సాహసంతో ముందడుగు వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. డబ్బు అందుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. ఉన్నతాధికారుల ప్రశంసలు. కళాకారులకు అవార్డులు, రివార్డులు.


సింహం : శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, భవనాలు కొంటారు. అప్పులు తీరి ఊరట లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో అందరితో సఖ్యత. శుభకార్యాల ప్రస్తావన.ఉద్యోగాల్లో అనుకున్న బదిలీలు. పదోన్నతులు లభించే సమయం. వ్యాపారాల్లో లాభాలు. పెట్టుబడులు అందుతాయి.రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారాంతంలో  శుభవర్తమానాలు. అదనపు ఆదాయం.

కన్య  : కొత్త పనులకు శ్రీకారం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనల అమలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనాలు,ఆభరణాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబ పెద్దల సలహాలు పాటిస్తారు. అందరి సహకారంతో ముందడుగు వేస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు నూతనోత్సాహం.

తుల : పనులు సకాలంలో పూర్తి.  స్థిరాస్తి వివాదాలు తీరతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. సంఘంలో గౌరవం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. బాకీలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అంది విస్తరిస్తారు. వాణిజ్యవర్గాలకు ఉత్సాహవంతం. ఉద్యోగాల్లో మీ శ్రమ వృథా కాదు. పైవారి నుంచి ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు పదవీయోగం. సన్మానాలు జరుగుతాయి.

వృశ్చికం  : కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు. ఆలోచనలకు కార్యరూపం. ప్రముఖులతో పరిచయాలు. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. ఉన్నతపోస్టులు. కళాకారులకు నూతనోత్సాహం.

ధనుస్సు : అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు.  ఆలోచనలు కలసిరావు. సమస్యలతో ఉక్కిరిబిక్కిరి. ప్రముఖులతో చర్చలు ఫలించవు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. కళాకారులకు గందరగోళం. వారారంభంలో శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. ఉద్యోగయత్నాల్లో అనుకూలత.

మకరం : పట్టుదలతో పనుల పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. భూములు, వాహనాలు కొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. నూతన వ్యక్తుల పరిచయం. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబసభ్యులతో, భాగస్వాములతో తగాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు పట్టిందల్లా బంగారమే.

కుంభం : ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారులకు లాభాలు. కొత్త భాగస్వాములతో కలుస్తారు. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల సాయం అందుతుంది. సత్తా చాటుకుంటారు. కళాకారులకు అనుకున్న అవకాశాలు. పురస్కారాలు. వారారంభంలో దూరప్రయాణాలు.

మీనం : మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. శత్రువులు మిత్రులుగా మారతారు. రుణాలు తీరతాయి. గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలు అనుకున్న రీతిలో విస్తరిస్తారు. లాభాలు తథ్యం.ఉద్యోగాల్లో కోరుకున్న పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400