వార ఫలాలు : 30.04.2023 నుంచి 06.05.2023

వార ఫలాలు  :   30.04.2023 నుంచి 06.05.2023

మేషం : ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలను సమయానికి పూర్తి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కే సూచన. భూములు, వాహనాలు కొంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు. అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యాపారులు ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకోని ప్రమోషన్లు దక్కవచ్చు.

వృషభం : తరచూ వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారం. ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్య కార్యాలు విజయవంతం. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం. నూతన విద్యావకాశాలు దక్కే సూచన. భూవివాదాల పరిష్కారంలో చొరవ. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

మిథునం : ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ప్రతి నిర్ణయంలోనూ కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. కొంత అస్వస్థత కలిగినా ఉపశమనం పొందుతారు. ప్రాణస్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కే అవకాశం.

కర్కాటకం: కొత్త కార్యాలు చేపడతారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. వివాహయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి విషయంలో నెలకొన్న ఇబ్బందులు అధిగమిస్తారు. ఒక కోర్టు కేసు పరిష్కారం.  జీవిత భాగస్వామితో విభేదాలు తొలగుతాయి. మీపై వచ్చిన అభాండాలు, విమర్శల నుంచి బయటపడతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులు బాధ్యతల నిర్వహణలో సమర్థత చాటుకుంటారు.

సింహం: చేపట్టిన కార్యాల్లో ప్రతిష్టంభన ఏర్పడినా అధిగమిస్తారు. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కారం. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలకు కార్యరూపం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులు అనుకోని పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం.

కన్య: ఆశించిన ఆదాయం సమకూరుతుంది. పరిచయాలు విస్తృతం. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వ్యవహారాల్లో చర్చలు ఫలిస్తాయి. వేడుకలు, సభలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కే అవకాశం. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారులకు గతం కంటే లాభాలు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

తుల: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వాహన, గృహయోగాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిత్రమైన సంఘటనలు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత స్వేచ్ఛ, ప్రశాంతత.

వృశ్చికం: సమస్యల నుంచి బయటపడే సమయం. ఆప్తులు, శ్రేయోభిలాషులు వద్దన్నా సాయపడతారు. ప్రత్యర్థులను సైతం మీవైపునకు ఆకర్షిస్తారు. రాబడి కొంత పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. రియల్‌ఎస్టేట్ వారికి అనుకూలం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు.

ధనుస్సు: స్నేహితులు సహకరిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఏ సమస్య ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు.

మకరం: పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని కార్యక్రమాలను పునఃప్రారంభిస్తారు. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువుల నుంచి పిలుపు. రాబడి పెరుగుతుంది. కుటుంబంలో ఇబ్బందులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు. ద్వేషభావం కలిగిన వారిని సైతం అక్కున చేర్చుకుంటారు. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులు విధుల్లో నైపుణ్యాన్ని చాటుకుంటారు.

కుంభం: దీక్షాదక్షతలతో ముఖ్య కార్యాలు పూర్తి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం. స్థిరాస్తి విషయంలో నూతన అగ్రిమెంట్లు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. మీఖ్యాతి పెరుగుతుంది. నూతన విద్యావకాశాలు. ఒక సంఘటనతో మీ జీవితం మలుపు తిరిగే అవకాశం. రాబడి, వ్యయాలు సమతూకం. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు.

మీనం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు క్రమేపీ తీరతాయి. ఆదాయానికి లోటుండదు. స్థిరాస్తి విషయంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో రాజీమార్గం అనుసరిస్తారు. భవిష్యత్తుపై భరోసా కలిగే అవకాశం. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారుల పెట్టుబడులకు తగిన లాభాలు. పోస్టులు లేదా ఇంక్రిమెంట్లు లభించవచ్చు.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు
ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 9885299400‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌