weekly Horoscope | వార ఫలాలు : అక్టోబర్ 22 నుంచి 28 వరకు

weekly Horoscope  | వార ఫలాలు : అక్టోబర్ 22 నుంచి 28 వరకు

మేషం : ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం. ఆదాయం కొంత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. భూముల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం. విద్యార్థులు కొంత ఊరట చెందే పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. రాజకీయ, పారిశ్రామికవేత్తలు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పరిశోధకులకు మంచి గుర్తింపు.

వృషభం : నిరుద్యోగాల ఆశలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారం. సమాజంలో  ప్రత్యేకత చాటుకుంటారు. విద్యార్థులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. ఆదాయం గతం కంటే కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారుల పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు అనుకూల సమయం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం.
 
మిథునం : ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. వివాహాది యత్నాలు కొంత ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగులకు విధుల్లో  ఆటంకాలు తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

కర్కాటకం : రాబడి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి. నేర్పుగా కొన్ని సమస్యల పరిష్కారం. విలువైన వస్తువులు కొంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని నిందించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మరింత ముమ్మరం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కళాకారులు, రచయితలకు సంతోషకరమైన సమాచారం.

సింహం : పెండింగ్‌లోని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం క్రమేపీ పెరిగి అవసరాలు తీరతాయి. మీ ఖ్యాతి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పట్టుదలతో ముందడుగు. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.  రాజకీయవేత్తలకు విశేష ఆదరణ లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి.

కన్య  : కొన్ని సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఆలోచనలకు కార్యరూపం. రాబడి ఆశాజనకం. కొత్త వ్యక్తుల పరిచయం. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. ముఖ్య నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కొంత ఊపిరి పీల్చుకునే సమయం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు.

తుల : బంధువర్గం నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్య కార్యక్రమాలలో విజయం. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుంచి పిలుపు ఆనందం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. క్రీడాకారులు, కళాకారులకు ఊహించని ఆహ్వానాలు.

వృశ్చికం : ఆదాయం గతం కంటే ఆశాజనకం. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. మీ నైపుణ్యతకు మెరుగు పెడతారు. శత్రువులను స్నేహితులుగా మార్చుకుంటారు. ఇళ్లు, వాహనాల కొనుగోలులో అవరోధాలు అధిగమిస్తారు.  కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. వ్యాపారులకు ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా తట్టుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.

ధనుస్సు : ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ప్రస్తుత పరిస్థితులను తట్టుకుని నిలబడతారు. ఇంతకాలం పడిన కష్టం  ఫలించే సమయం. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊరట. పరిశోధకులు, కళాకారులకు కొత్త అవకాశాలు.

మకరం : స్వీయ ఆలోచనలతో  కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. రావలసిన బాకీలు అందుతాయి. ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు  
విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. కళాకారులకు కొంత అనుకూలస్థితి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు కాస్త ఊరట. 

కుంభం : అనుకున్న కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. బంధువర్గం నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నిరాసక్తత. వారారంభంలో ధనలబ్ధి. వివాదాల పరిష్కారం.

మీనం : ఆదాయం పెరుగుతుంది. బంధువులతో సఖ్యత. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కొత్త నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనే వీలుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400