వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్కు రజతం

వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్కు రజతం

కామన్‌వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు.  తాజాగా వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ 96 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. మొత్తం 346కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు ఎత్తిన వికాస్..  క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కేజీలు ఎత్తాడు.  మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంతో సిల్వర్ను సొంతం చేసుకున్నాడు.  దీంతో ఇప్పటివరకు భారత్‌ మొత్తం 12 పతకాలు సాధించింది. అందులో ఐదు బంగారు పతకాలు కాగా, 4 రజతం, 3 కాంస్యాలు ఉన్నాయి.

కామన్వెల్త్ గేమ్స్ లో వికాస్ ఠాకూర్ కు ఇది రెండో సిల్వర్ మెడల్. 2014లో గ్లాస్గో కామన్వెల్త్ లోనూ అతడు రజతం సాధించాడు.  2018 గోల్డ్ కోస్ట్‌లో కాంస్యాన్ని దక్కించుకున్నాడు. 96 కేజీల విభాగంలో  సమోవాకు చెందిన డాన్ ఒపెలోజ్ 381 కేజీ ఎత్తి స్వర్ణం సాధించాడు.  ఇతను మూడు రికార్డులు బ్రేక్ చేశాడు. స్నాచ్ రౌండ్‌లో 171 కేజీలు ఎత్తిన డాన్  ఒపెలోజ్.. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 210 కేజీలు ఎత్తాడు.  దీంతో 381 కేజీలతో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఫిజీకి చెందిన తానియెలా తుయిసువా రైనిబోగి మొత్తం 343కిలోల ఎత్తి  కాంస్యం సాధించాడు.