సరదాకి వెళ్లి.. డబ్బింగ్ స్టార్ అయ్యింది

సరదాకి వెళ్లి.. డబ్బింగ్ స్టార్ అయ్యింది

‘ఆ రోజే చెప్పాను నా బేకరీ మీద ఆదాయం నీది.. నీ ఎరోప్లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీద వచ్చే ఆదాయం నాది’.. ‘మరీ అంత పౌరుషం ఎందుకో మీకు’.. అంటూ ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైలాగులు, డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అపర్ణ బాల మురళీ. ఈ సినిమాలో డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎంతమంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారో.. ఆమె వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అంతే ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

తెలుగులో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించిన ‘గురు’ సినిమాలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రితికాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పట్లో మంచి క్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. తమిళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలుగులో ఆ గొంతుకు అప్పట్లో చాలామంది ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారయ్యారు కూడా. అందర్నీ ఆకట్టుకున్న ఆ గొంతు ఎవరిదో కాదు.. తమిళనాడులో సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మన తెలుగు అమ్మాయి ఉమా మహేశ్వరి రేలంగిది. సరదాగా ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లి.. అనుకోకుండా ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టేసింది. అక్కడ నుంచి అనుష్క, నిహారిక, మెహ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమలా పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓవియాలకు తమిళంలో డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పింది ఈ తెలుగమ్మాయి. ‘గురు’ సినిమాలో రితికా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రెండు భాషల్లో డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పి ‘వాహ్వా’ అనిపించుకుని అవార్డులు సొంతం చేసుకున్న ఉమ గురించి తన మాటల్లోనే.

“ పెద్దనాన్న రేలంగి నరసింహారావు. నాన్న రేలంగి రవీంద్రనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇద్దరూ సినిమాల్లో చేసేవాళ్లు. మేం తమిళనాడులో సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోయాం. ఇద్దరూ సినిమా ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నా.. ఎప్పుడూ ఆ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లాలని అనుకోలేదు. చదువులో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేదాన్ని. ఎంకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాను. ఏదో ఒక జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుదాం అనుకున్నాను. కానీ, డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోయాను. ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాకపోతే ఎక్కడ డిప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతానో అనే భయంతో నాన్న ‘వద్దు’ అన్నారు. ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వచ్చి క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన తర్వాత ఆయనే ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అలా నేను, నాతో పాటు నా చెల్లెలు శైలజ కూడా డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది.  

ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెళ్లి..

డిగ్రీ చదువుతున్న టైంలో నాఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్తూ  నన్ను తోడుగా తీసుకెళ్లింది. ‘నువ్వు కూడా చెప్పొచ్చు కదా’ అన్నారు. అలా సరదాగా ఇచ్చిన ఆడిషన్ ఇప్పుడు ప్రొఫెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఒకపక్క చదువుకుంటూనే పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పేదాన్ని. అలా ఎంకామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు చదువుకున్నాను. పీజీ అయిన తర్వాత ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే కాన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాను. ముందు కార్టూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పేదాన్ని. ఆ తర్వాత హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెప్పే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అలా మొదట ‘వల్లభ’ సినిమాకి చెప్పాను. ఆ తర్వాత ‘గురు’ సినిమాలో రితికా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెప్పినప్పుడు చాలా మంచి పేరు వచ్చింది. అవార్డులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘బాహుబలి – 2’, ‘భాగమతి’  సినిమాలకు తమిళంలో అనుష్కకు గొంతిచ్చాను. ‘ఒరు నల్లనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత సొల్​రే’ సినిమాలో నిహారికకు డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాను. చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేది. కుదరలేదు. కానీ, గొంతు వల్లే ఇంత ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాను అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

‘గురు’కి చాలా హోంవర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశా!

తమిళంలో  వచ్చిన ‘ఇరుది సుట్రు’ సినిమాకి అనుకోకుండా చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. 10 – 15 మంది వచ్చారు. ఆడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వచ్చేశాను. 15 రోజుల వరకు కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాలేదు. సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వలేదులే అనుకున్నాను. ఆ తర్వాత ఒక రోజు కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుధా కొంగర పిలిచి వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా రఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కావాలని మాడ్యులేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దాని కోసం చాలా హోంవర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాను. ఇంట్లో అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ.. ఆ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడానికి చాలా గట్టిగా అరిచేదాన్ని. ఒక్కోసారి మా ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు. అలా అచ్చం రితికాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగానే చెప్పాను. రోజుకు ఒక్క డైలాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే చెప్పేదాన్ని. వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ మాడ్యులేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోకుండా ఉండేందుకు దాదాపు 15 రోజుల పాటు డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నాం. అలా తమిళంలో నా వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగా క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో ‘గురు’కు కూడా నా తోనే చెప్పించారు. దాంతో తెలుగులోకి కూడా అడుగు పెట్టాను. ఆ సినిమాలో చాలామంది ఆ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రితికా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది అనే అనుకున్నారు. వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం కోసం కూడా చాలా కష్టపడ్డాను. వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే వాళ్లతో తరచూ మాట్లాడేదాన్ని. అప్పుడు నా హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నా టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసిన సుధా కొంగర ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు కూడా చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.  

అనుకోకుండా వచ్చింది బాహుబలి –2

బాహుబలి –2లో అనుష్కకు డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పేందుకు ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నాయని తెలిసింది. కానీ, అనుష్క వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే చాలా స్మూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. నా గొంతు సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాదు వెళ్లకూడదని అనుకున్నాను.  మా అమ్మ ఒప్పుకోలేదు. ‘అలాంటివి చెప్పినప్పుడే కదా టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిసేది’ అని నన్ను ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పంపారు. నేను చెన్నై నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చేసరికి ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి ప్యాకప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పేస్తున్నారు. లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాను. 15 రోజుల వరకు ‘నో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. ‘ఎవరినో సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఉంటారులే’ అని లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాను. అలా 15 రోజుల తర్వాత కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆ తర్వాత అనుష్కకు డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పడం, దానికి అవార్డు రావడం అందరికీ తెలిసిందే. అందరూ “ అనుష్క వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగానే ఉంది’’ అని చాలా కాంప్లిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. బాహుబలి –2 చూశాక భాగమతి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశం ఇచ్చారు. ‘ఇరిదిసుట్రు’, ‘బాహుబలి–2’ నా లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చెప్పాలి. ‘గురు’లో రఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అనుష్కకి స్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఇంకా మెహ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఒకలా, జ్యోతికకి అచ్చం ఆమె వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి చెప్పేదాన్ని. ‘అన్ని రకాలుగా ఎలా చెప్తారు’ అని అడుగుతుంటారు.  

చాలామంది గుర్తుపడుతున్నారు

ఒకసారి రేడియోలో ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాను. వాళ్లు ఆ వీడియోను యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టారు. దాంట్లో అన్నీ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసి చూపించాను. దాని వల్ల ఇప్పుడు నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు. ఒకరోజు షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్తే ఒకతను గుర్తుపట్టి “ మీరు ఉమ కదా. అనుష్క, రితికాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు కదా అని అడిగారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా యోగా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా చాలామంది కొత్తవాళ్లు నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతుంటారు. సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ‘అక్కా మీ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కా, మీకు పెద్ద ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కా, రేడియోలో చూశాను మీరేనా డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పింది” అని మేసేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడుతుంటారు. కొందరైతే ‘అక్క మీరు తెలుగు కూడా మాట్లాడతారా’? అని ఆశ్చర్యపోతున్నారు.

“ ఇరుది సుట్రు రిలీజైన కొన్ని రోజులకు నాకు పెళ్లి అయ్యింది. మా ఆయన కార్తిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా గొంతుకు చాలాపెద్ద ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని అప్పుడే నాకు తెలిసింది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘ఏ సినిమాలకు డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు’ అని అడిగితే చెప్పాను.‘ఆ గొంతుకు నేను పెద్ద ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నువ్వేనా చెప్పింది’ అని అన్నారాయన. అప్పుడప్పుడు ఆ గొంతుతో డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పించుకుంటారు. ఇంట్లో నేను చేసే హోంవర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయన చాలా సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. నాకు సజెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తుంటారు కూడా”  

యానిమల్​ లవర్​ని..

డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పడంతో పాటు పెట్స్ కూడా పెంచుతాను. వీధి కుక్కలు, పిల్లులను పెంచడం అంటే చాలాఇష్టం. ఇప్పటి వరకు దాదాపు 20 పిల్లుల్ని పెంచుతున్నాను. మా ఏరియాలో కుక్కలు మా ఇంటి చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి. ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైంకి అన్నీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఒక గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసుకుని ఎమర్జెన్సీలో ఎక్కడైనా స్ట్రే డాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి దెబ్బలు తగిలితే వెళ్లి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాం. దాన్ని ఇంకా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, యానిమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలనేది ఆశ.

అమ్మ కనక్క’ అనే సినిమాలో అమలాపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి డబ్బింగ్‌ చెప్పాను. అప్పుడు ఇళయరాజా గారు‘వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా లైవ్‌ గా ఉంది. క్యారె క్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బాగా సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది.
చాలా ఫీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చక్కగా చెప్పిం ది’ అని అన్నారంట. అది విన్న నా ఆనందానికి అవధులు లేవు. జీవితంలో నేను మర్చిపోలేని చాలా పెద్ద కాంప్లిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అది”

తెలుగులో చెప్పడమే చాలాకష్టం
తమిళం, తెలుగు రెండు భాషల్లో డబ్బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాను. రెండు భాషలూ బాగా వచ్చినా కూడా తెలుగులో చెప్పడం చాలా కష్టం. తెలుగులో ఒత్తులు అన్నీ చాలా స్పష్టంగా పలకాలి. తమిళంలో ఆ కష్టం ఉండదు. అందుకే తెలుగులో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయంతో చెప్తాను. తమిళంలో కూడా చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అందరూ నన్ను తమిళ అమ్మాయి అనే అనుకుంటారు. ఫ్యాన్స్‌ అందరూ ‘తమిళ పొన్ను’ ఉమ అంటారు. చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగినా ఇంట్లో నాన్న కచ్చితంగా తెలుగులోనే మాట్లాడించేవారు. తెలుగులో చాలా పుస్తకాలు తెప్పించి మరీ మాతో చదివించేవారు. దానివల్ల తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాను.  ::: తేజ తిమ్మిశెట్టి

for more News…

వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టి మొదటి టిక్ టాక్ స్టార్

ప్రాజెక్టు ఏదైనా.. పేదల భూముల్లే లాక్కుంటున్నారు

పబ్జీ బంపర్ ఆఫర్: టోర్నీ గెలిస్తే కోట్లు, గేమ్ ను డిజైన్ చేస్తే లక్షల్లో జీతాలు

ఎలక్షన్లు రాంగనే… ఓటర్లపై ప్రేమ పుట్టె