వెస్టిండీస్ క్రికెటర్కు ఏమైంది: ఒంటిపై ఉన్న ఆ మచ్చల వెనుక అసలు ముచ్చట ఇదే!

వెస్టిండీస్ క్రికెటర్కు ఏమైంది: ఒంటిపై ఉన్న ఆ మచ్చల వెనుక అసలు ముచ్చట ఇదే!

John Campbell skin: గువాహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (John Campbell) సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి వన్డేలో కిరాక్ ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటర్, ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్యాంప్‌బెల్.. పవర్‌ప్లేలోనే విండీస్ స్కోరును 96/1కి పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ కేవలం 65 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 9 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి.

అసలు ఆ మచ్చలు ఏంటి: 

జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు ఆయన చేతులు, ముఖంపై ఉన్న తెల్లటి మచ్చలను గమనించారు. దీంతో అతడికి ఏదైనా చర్మ సమస్య ఉందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఆ మచ్చలు విటిలిగో (Vitiligo) అనే చర్మ వ్యాధిని పోలి ఉన్నాయి.

విటిలిగో (Vitiligo) అంటే ఏమిటి: 

* విటిలిగో అనేది రోగ నిరోధక వ్యవస్థ (Immune System) లోపించడం వల్ల వచ్చే ఒక సాధారణ చర్మ సమస్య మాత్రమే అని ఆరోగ్య నిపుణలు పేర్కొంటున్నారు.

* మన శరీరంలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ (Melanin) అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ కణాలపై రోగ నిరోధక శక్తి పొరపాటున దాడి చేసి వాటిని దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరంలోని వివిధ భాగాలపై తెల్లటి లేదా తేలికపాటి మచ్చలు ఏర్పడతాయి.

* ఇది గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. విటిలిగో అనేది అంటువ్యాధి కాదు. ఇది ఎవరికైనా రావచ్చు. ఇది చెడు పరిశుభ్రత వల్ల వచ్చేది కాదు.

ALSO READ : నమన్ ధీర్ డైవింగ్ క్యాచ్.. భారత్‌కు అనుకూలంగా అంపైర్ల నిర్ణయం!

* రిపోర్ట్స్ ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో విటిలిగోతో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా జాన్ క్యాంప్‌బెల్ గుర్తింపు పొందారు. తన శారీరక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ స్థాయి క్రికెట్‌లో అతను రాణిస్తున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.