ఏం ఐడియా : పిల్లల డైపర్ లో తుపాకీ బుల్లెట్లు

ఏం ఐడియా : పిల్లల డైపర్ లో తుపాకీ బుల్లెట్లు

న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో డిసెంబర్ 20న డిస్పోజబుల్ బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి ఉంచినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారని రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఎక్స్-రే మెషీన్‌లో అలారం మోగడంతో అధికారులు ప్రయాణీకుల క్యారీ-ఆన్ బ్యాగ్ నుంచి ఓ డైపర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు TSA తెలిపింది.

ఏజెన్సీ ప్రకారం, బుల్లెట్స్ తో నింపిన డైపర్ తన బ్యాగ్‌లో ఎలా చేరిందో తనకు తెలియదని ప్రయాణీకుడు మొదట వాదించాడు. కానీ ఆ తరువాత అతను తన స్నేహితురాలే అలా ఉంచమని సూచించిందని ఏజెన్సీ తెలిపింది. TSA ప్రయాణికుడిని చికాగో మిడ్‌వే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి టిక్కెట్టు తీసుకున్న అర్కాన్సాస్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించింది. కానీ అతని పేరును వెల్లడించలేదు.