Kitchen Tips: పప్పుల డబ్బాల్లోకి పురుగులు రాకుండా ఏం చేయాలో తెలుసా

Kitchen Tips: పప్పుల డబ్బాల్లోకి పురుగులు రాకుండా ఏం చేయాలో తెలుసా

వంట గదిలో ఆహార వస్తువులను ఎక్కువ రోజుల పాటు నిలువ చేస్తే పురుగులు పడుతుంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా పప్పు దినుసులకు త్వరగా పురుగులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ తరుణంలో పప్పులకు పురుగులు పట్టకుండా ఉండేందుకు మహిళలు కొన్ని రసాయనాలు వాడుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అసలు మంచివి కావని.. ఇబ్బందులు కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. పురుగులు పట్టకుండా ఉండేందుకు వాడే బోరిక్ యాసిడ్ వంటి రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందువల్ల రసాయనాలు కాకుండా ఇంట్లోని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మంచిది. మరి అవేంటో తెలుసుకుందాం.

ఇంగువ..

ఇంగువతో పప్పులను పురుగుల బారి నుండి రక్షించవచ్చు. డబ్బాలలో పప్పులను స్టోర్ చేసుకునే ముందు ఈ చిన్న పదార్థాన్ని ఉపయోగిస్తే ఎటువంటి సమస్యలు రావట. పప్పు చారులో ఉపయోగించే ఇంగువకు పప్పులకు పురుగులు పట్టకుండా ఉండేలా కూడా కాపాడుతుంది. ఘాటు వాసనతో ఉండే ఇంగువ స్మెల్ వల్ల పురుగులు దెబ్బకు పారిపోతాయి లేదా చచ్చిపోతాయి. అందువల్ల బియ్యం పప్పులు వంటి ఎక్కువ కాలం నిల్వ ఉంచే వాటిలో ఇంగువను వేయడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలా ఉపయోగించాలి..

ఇంగువను చిటికెడంత తీసుకుని ఒక బట్టలో చుట్టాలి. దానిని బియ్యం లేదా పప్పులను స్టోర్ చేసే డబ్బాలలో ఉంచాలి. అందువల్ల ఇంగువ వాసన ఆ డబ్బాలో మొత్తం వ్యాపించి చెడు వాసనను కూడా నియంత్రిస్తుంది. అంతేకాదు ఇంగువను ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంగువ చాలా మేలు చేస్తుంది. ఇంగువకు కఫాన్ని తగ్గించే శక్తి ఉండడం వల్ల ఏ సమస్యను అయినా తరిమికొడుతుంది. ఇంగువ పొడిని కాస్త తేనె, అల్లం రసంలో కలుపుకుని తీసుకోవడం వల్ల దగ్గు సమస్యకు దూరం అవ్వొచ్చు.