జాతి నిర్మాణం.. అత్యవసరం!

జాతి నిర్మాణం.. అత్యవసరం!

భారతదేశం తన చరిత్రలో ఒక కీలకమైన సందర్భంలో నిలబడి ఉంది. సుమారు 1850 BCEలో పర్షియన్ దండయాత్ర నుంచి 1947లో బ్రిటిష్  వలస పాలన ముగిసేవరకు, దాదాపు 3,825 సంవత్సరాలపాటు మనభూమి నిరంతర విదేశీ అణచివేతను భరించింది. సామ్రాజ్యాలు, సంస్కృతులు,  భావజాలాలతో  కూడిన ఈ దండయాత్రలు.. మన శారీరక, మానసిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆకృతిపై లోతైన గాయాలను మిగిల్చాయి.

స్వాతంత్ర్యం సాధించిన 77 సంవత్సరాల తర్వాత భారతదేశం స్వరాజ్యం లేదా స్వీయ-పాలన విజయాన్ని జరుపుకుంటోంది. కానీ, శతాబ్దాల నీడలో ఉన్న బంధనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.1947 నుంచి నిర్మాణాత్మక జాతి నిర్మాణ కార్యక్రమం లేకపోవడం వల్ల మన సమాజం విచ్ఛిన్నమైంది, మన విలువలు క్షీణించాయి.  మన జాతీయ గుర్తింపు తడమాటంలో ఉంది. ఈ నేపథ్యంలో జాతి నిర్మాణం తక్షణ నైతిక, నాగరికతా అవసరం.

మన సమాజాన్ని ఏ విలువలు నడిపిస్తున్నాయి?

1947 స్వాతంత్ర్యం ఒక విజయం. ఇది 200 సంవత్సరాల బ్రిటిష్ ఆధిపత్యాన్ని ముగించి స్వీయ-పాలన సాక్షాత్కారాన్ని సూచించింది. అయినప్పటికీ, ఆ సమయంలో జాతీయ నాయకులు, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడంలో నిమగ్నమై ఒక కీలక అవసరాన్ని విస్మరించారు. శతాబ్దాల అణచివేత వల్ల గాయపడిన జాతిని స్వస్థపరచడం.  3,825 సంవత్సరాల విదేశీ పాలనలో మానసిక, సామాజిక, లేదా సాంస్కృతిక గాయాలను అంచనా వేయడానికి ఎటువంటి  మూల్యాంకనం జరగలేదు. 

 మన నాగరికతను శతాబ్దాల కష్టాల ద్వారా నిలబెట్టిన ధార్మిక, వైదిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి ఎటువంటి నిర్మాణాత్మక ప్రణాళిక రూపొందించలేదు. బదులుగా, చరిత్ర  గాయాలకు ముగింపు అవసరం లేదన్నట్లుగా జాతి ముందుకు సాగింది.  తరతరాలుగా విభజన, ఆత్మవిశ్వాస లోపం,  సాంస్కృతిక విచ్ఛిన్నత  వారసత్వంతో పోరాడుతూ 77 సంవత్సరాల తర్వాత, ఈ నిర్లక్ష్యం  పరిణామాలను మనం ఎదుర్కొంటున్నాం.  

మన సమాజాన్ని ఏ విలువలు నడిపిస్తున్నాయి?  కులం, మతం, ప్రాంతం లేదా భాష విభేదాలలో మనం ఐక్యంగా ఉన్నామా?  భౌతికవాదం మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మించిపోయిందా?  మన సంస్థలు నీతియుతమైనవా,  మన రాజకీయాలు నైతికమైనవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆందోళనకరంగా ఉన్నాయి. సామాజిక అసమతుల్యత పెరుగుతోంది. అవినీతి అన్ని రంగాలలో వ్యాపించింది.   మన స్వదేశీ సంస్కృతి ఒకప్పుడు మన గుర్తింపునకు పునాది. అది ప్రస్తుతం ప్రపంచీకరణ వినియోగవాదం బరువు కింద క్షీణిస్తోంది. 

సమాజాలు విచ్ఛిన్నం

కుటుంబాలు బలహీనపడుతున్నాయి, సమాజాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మన జాతీయ గర్వం 
క్షీణిస్తోంది. ఇది మన స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న ‘గొప్ప భారతీయ కల’ కాదు.  ఇది జాతి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం  వల్ల  లభించిన ప్రత్యక్ష ఫలితం.  1947లో  రాజ్యాంగ సభ మన గణతంత్రాన్ని పాలించడానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చింది. కానీ, సామాజిక పరివర్తన లేదా సాంస్కృతిక పునరుజ్జీవనానికి మార్గం చూపలేదు. ఇది జాతీయ లక్ష్యాలను నిర్దేశించలేదు.  

ఉమ్మడి విలువలను నిర్వచించలేదు.  శతాబ్దాల అణచివేత నుంచి ఉద్భవిస్తున్న ప్రజలకు మార్గనిర్దేశక కాంతిని అందించలేదు. అత్యంత కీలకంగా, ఇది మన నాగరికతను అమానవీయ అణచివేతలో కూడా జీవించి వృద్ధి చెందేలా చేసిన ధార్మిక, వైదిక,  ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించలేదు.  ఈ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదను మన కొత్త గణతంత్రం ఆకృతిలో అల్లడం విఫలమవడం.. మనల్ని ఇప్పటికీ వెంటాడుతున్న ఒక తరం నిర్లక్ష్యం. జాతి నిర్మాణం ఒక అస్పష్ట ఆదర్శం కాదు. ఇది ఐక్యత, ఉద్దేశం,  పురోగతిని  ప్రేరేపించే ఉమ్మడి సూత్రాలలో రూటుపెట్టిన సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా రూపొందించడం.  ఆర్థికవృద్ధి, అవసరమైనప్పటికీ, సామాజిక పరివర్తన లేకుండా ఖాళీగా ఉంటుంది.  ప్రజలు విభజించబడితే, సంస్థలు అవినీతితో ఉంటే,  సంస్కృతి క్షీణిస్తే, ఒక జాతి కేవలం భౌతిక సంపదపై వృద్ధి చెందలేదు. 

శాంతి పునరుద్ధరణకు మార్గనిర్దేశం

భారతదేశం వైదిక జ్ఞాన సంపద ఈ పరివర్తనకు ఒక రూపకల్పనను అందిస్తుంది. అయినప్పటికీ గత నాయకులు దానిని ఉపయోగించడంలో విఫలమయ్యారు. జాతీయ విలువల  ఫ్రేమ్‌వర్క్  లేకపోవడం మనల్ని దిశలేనిదిగా చేసింది.   సామరస్యమైన స్వావలంబన సమాజాన్ని నిర్మించేందుకు జాతి నిర్మాణ ఫౌండేషన్ (ఎన్బీఎఫ్) ఒక ధైర్యమైన, దూరదృష్టితో కూడిన పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నది. భారతీయ జాతీయ విలువల  ఫ్రేమ్‌వర్క్ సృష్టి  విద్వాంసులు, ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక చింతకులు, పౌరుల సహకారంతో  రూపొందుతున్నది.  

ఈ ఫ్రేమ్‌వర్క్ భారతదేశ నాగరికత వారసత్వం నుంచి తీసుకుని, మన గతం  భవిష్యత్తుతో సంధానం చేసే విలువలను ప్రోత్సహిస్తుంది.  ధర్మం,  నైతిక ప్రవర్తన, జవాబుదారీతనాన్ని ప్రేరేపిస్తుంది.   సామాజిక  పారదర్శకత, సత్యాన్ని పెంపొందిస్తుంది.  అహింస, శాంతి పునరుద్ధరణకు మార్గనిర్దేశం చేస్తుంది.  కులం, మతం,  ప్రాంతం విభేదాలు సమసిపోయేలా సమన్వయం చేస్తుంది. స్వదేశీ ఆర్థిక, సాంస్కృతిక, బౌద్ధిక స్వావలంబనను పునరుద్ధరిస్తుంది.  వైదిక జ్ఞానాన్ని ఆధునిక నైపుణ్యాలతో సమీకరిస్తూ, అందరికీ సమాన విద్యావకాశాలను నిర్ధారిస్తుంది.  

సమ్యక్ దృష్టి (సమగ్ర దృష్టి) విభిన్న సమాజాలను ఉమ్మడి జాతీయ ఉద్దేశం కింద ఐక్యం చేస్తుంది, పురోగతిని పెంపొందిస్తుంది. ఈ  ఫ్రేమ్‌వర్క్​ను రూపొందించడానికి ఎన్బీఎఫ్​ గొప్ప మనస్సులతో కలిసి పనిచేస్తోంది. ఇది సమ్మిళితమైనది, అనుకూలమైనది.   కుటుంబం, విద్యాసంస్థలు, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలను ప్రోత్సహిస్తోంది.  కార్యక్రమాలు, వర్క్​షాప్‌లు, ప్రచారాలు, పాఠ్యప్రణాళికల ద్వారా జాతి నిర్మాణాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. 

తరతరాలకు.. సామరస్యమైన, విలువలతో -నడిచే సమాజం దిశగా మార్గనిర్దేశం చేస్తుంది. ఇది ఒక స్వల్పకాలిక ప్రాజెక్టు కాదు.  గత గాయాలను స్వస్థపరచడానికి, మన పూర్వీకుల త్యాగాలకు తగిన భవిష్యత్తును రూపొందించడానికి ఒక తరం నిబద్ధత.  జాతీయ విలువల  ఫ్రేమ్‌వర్క్ లేకుండా,  భారతదేశం మరింత విభజన,  సాంస్కృతిక క్షీణత,  నైతిక పతనం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థిక పురోగతి ఒక్కటే మన నాగరికతా వైభవాన్ని పునరుద్ధరించలేదు. 

ప్రపంచాన్ని ప్రేరేపించే జాతిని నిర్మిద్దాం

పెరుగుతున్న అసహనం, సంస్థాగత క్షీణత,  సంస్కృతిని విస్మరించడం వంటి మన సమాజంలోని పగుళ్లు తక్షణ చర్యలను డిమాండ్ చేస్తున్నాయి. జాతి నిర్మాణాన్ని స్వీకరించడం ద్వారా మనం శతాబ్దాల ప్రాశస్త్యాన్ని తిరిగి నిర్మించవచ్చు.  మన నైతిక పునాదులను పునర్నిర్మించవచ్చు.  మన విభిన్న ప్రజలను ఉమ్మడి దృష్టి కింద ఐక్యం చేయవచ్చు. ఈ ఫ్రేమ్‌వర్క్ మన యువతను సాధికారం చేస్తుంది, మన సమాజాలను బలోపేతం చేస్తుంది.  

జ్ఞానం, సామరస్యం  దీపస్తంభంగా  ప్రపంచంలో  మన స్థానాన్ని ఉన్నతం చేస్తుంది. దీనికి సమష్టి సంకల్పం అవసరం.  ప్రతి భారతీయ పౌరుడు, నాయకుడు,  సంస్థను ఈ పరివర్తన యాత్రలో చేరమని ఎన్బీఎఫ్​ పిలుపునిస్తుంది. మనం మన ధార్మిక వారసత్వాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. గతం  అవశేషంగా కాదు, భవిష్యత్తుకు జీవన మార్గదర్శిగా. స్వల్పకాలిక లాభాల కంటే సామాజిక పరివర్తనకు, సంపద కంటే విలువలకు, విభజన కంటే ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి.  

భారతీయ జాతీయ విలువల ఫ్రేమ్‌వర్క్ సృష్టి కేవలం ఒక విధాన ప్రతిపాదన కాదు,  స్వతంత్ర గణతంత్రంలో భారతీయుడిగా ఉండడం అంటే ఏమిటో తిరిగి నిర్వచించే అవకాశం. 3,825 సంవత్సరాల గాయాలను స్వస్థపరచుకుందాం.77 సంవత్సరాల జాతీగర్వాన్ని పునరుద్ధరించుకుందాం. శతాబ్దాల పాటు ప్రపంచాన్ని ప్రేరేపించే జాతిని నిర్మిద్దాం.  జాతి నిర్మాణానికి ఐక్యంగా లేచి, మన గతాన్ని సమ్మానించే, మన భవిష్యత్తును ప్రకాశింపజేసే ‘గొప్ప భారతీయ కల’ను  సాకారం చేసుకుందాం.

-‌‌ వ్యాసకర్త:- కె. కృష్ణ సాగర్ ​రావు ,  జాతి నిర్మాణ ఫౌండేషన్ చైర్మన్, సంస్థాగత వ్యూహకర్త, నాయకత్వ కోచ్-