గోల్డా? షేర్లా?.. ఈ దీపావళికి ఏది కొంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోల్డా? షేర్లా?..  ఈ దీపావళికి ఏది కొంటే  బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఏడాది కాలానికైతే షేర్లే మంచిదంటున్న ఎనలిస్టులు
  • లాంగ్‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌, షేర్లు రెండింటితోనూ లాభాలే!
  • రిస్క్ తీసుకునే స్వభావం బట్టి ఎంచుకోవాలని సలహా

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌లో  కొత్త ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు చేస్తే మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ, ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌, గోల్డ్‌‌‌‌‌‌‌‌, షేర్లు అంటూ   అనేక అసెట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ కొంటే మంచిదని కొంత మంది అంటే, షేర్లను కొనుక్కుంటే  లాభాలొస్తాయని మరికొంత మంది సలహా ఇస్తున్నారు. ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే దీపావళి టైమ్‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడం ఆనవాయితీ. కానీ, యంగ్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌ బంగారం కంటే షేర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ భయాలు ఉన్నాయని, బంగారం కొనుక్కుంటే ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌కు హెడ్జ్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుందని గోల్డ్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్ చేసే  ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ భయాలు ఉన్నా, మన మార్కెట్ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని షేర్లను సపోర్ట్ చేసే వాళ్లు వాదిస్తున్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూడా చాలా సార్లు భారీగా నష్టపోయి, తిరిగి రీబౌండ్ అవ్వడం చూశాం.  గోల్డ్‌‌‌‌‌‌‌‌ మంచిదా లేదా  షేర్లా? అనే డిబేట్‌‌‌‌‌‌‌‌ చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. బంగారంలోని పెట్టుబడులకు సేఫ్టీ ఉంటే, షేర్లలోని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు భారీ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

రిటర్న్స్ ఇలా..

గత పదేళ్లలో 10 గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌ (24 క్యారెట్లు) ధర రూ.29,600 నుంచి రూ.62,480 కి పెరిగింది.  అంటే ఏకంగా 111 శాతం రిటర్న్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ నిఫ్టీ 6,299 లెవెల్‌‌‌‌‌‌‌‌ నుంచి 19,407 కి చేరుకుంది. ఇది 200 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌కు సమానం. కొన్ని క్వాలిటీ షేర్లలో ఇన్వెస్ట్ చేసి, పదేళ్లు హోల్డ్ చేసి ఉంటే ఇంత కంటే ఎక్కువ లాభం వచ్చేది. అలానే క్వాలిటీ లేని షేర్లలో ఇన్వెస్ట్  చేసి ఉంటే భారీ నష్టం కూడా వచ్చేది. నిఫ్టీలో 50 లార్జ్ క్యాప్ షేర్లు ఉంటాయి. గత పదేళ్లలో ఈ షేర్లు భారీగా పెరగడంతోనే నిఫ్టీ 200 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసింది.

ఎనలిస్టుల సలహా..

గోల్డ్‌‌‌‌‌‌‌‌, షేర్లు రెండూ  గత పదేళ్లలో మంచి రిటర్న్స్ ఇవ్వడంతో ఈ దీపావళికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలనే సందేహం రావొచ్చు. ఇందుకు సంబంధించి ఎనలిస్టులు తమ ఆలోచనలు పంచుకున్నారు.  

1. ‘ఇండియాలో ఎలక్షన్స్ ఉండడంతో పాటు యూఎస్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లు పీక్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌కు చేరుకోవడంతో  దేశ మార్కెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.   గోల్డ్‌‌‌‌‌‌‌‌ కూడా రానున్న నెలల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేయొచ్చు.  వచ్చే ఏడాది యూఎస్ ఎకానమీ స్లోడౌన్‌‌‌‌‌‌‌‌ అవుతుందనే అంచనా వేస్తున్నాను. కానీ, నేనైతే షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతా. గ్లోబల్ మార్కెట్లు, గోల్డ్‌‌‌‌‌‌‌‌ కంటే  ఇండియన్ మార్కెట్లు  ఎక్కువగా పెరుగుతాయి’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌ ఎండీ సునిల్‌‌‌‌‌‌‌‌ నైతి అన్నారు.
2.  జియో పొలిటికల్ టెన్షన్ల వలన గోల్డ్ ధరలు ఈ మధ్య బాగా పెరిగాయని ప్రోస్టాక్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ ఎస్‌‌‌‌‌‌‌‌పీ తోష్నివాల్‌‌‌‌‌‌‌‌  పేర్కొన్నారు. ఎప్పుడైనా గోల్డ్ ధరలు ఎక్కువగా పెరిగితే కొంత కాలం పాటు కన్సాలిడేటెడ్ అవుతాయని లేదా పడతాయని చెప్పారు. ఏడాది కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షేర్లు బెటర్ అని చెప్పారు.
3. గోల్డ్‌‌‌‌‌‌‌‌, షేర్లు రెండూ మంచివేనని, ఎంత మేర రిస్క్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటారనేదాని బట్టి  ఎంచుకోవాలని రెలిగేర్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా వెల్లడించారు. ‘రిస్క్ ఎక్కువైనా పర్వాలేదని అనుకుంటే ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 70–90‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం షేర్లలో పెట్టాలి. మిగిలిన అమౌంట్‌‌‌‌‌‌‌‌ను గోల్డ్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయాలి’ అని సలహా ఇచ్చారు.
4.  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరిగినా, ఎకానమీ బాగోలేకపోయినా గోల్డ్‌‌‌‌‌‌‌‌లోని పెట్టుబడులకు ఏం కాదని లిక్విడె ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనూజ్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్​ అన్నారు. కానీ, ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ బలంగా ఉందని, దూసుకుపోయే స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉందని,  ఇలాంటి టైమ్‌‌‌‌‌‌‌‌లో షేర్లు మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్పారు. ముఖ్యంగా లాంగ్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌ కోసం ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసేటోళ్లకు షేర్లు బెటర్ అని చెప్పారు.  ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో షేర్లు, గోల్డ్ రెండూ ఉంచుకోవాలని ఎనలిస్టులు అంగీకరిస్తున్నారు.  ఎందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనేది రిస్క్ తీసుకునే స్వభావం బట్టి నిర్ణయించుకోవాలని అన్నారు.  సాధారణంగా పెద్ద కంపెనీల షేర్లు ఏడాదికి 12–15 శాతం మధ్య లాభాన్నిస్తాయి. అదే గోల్డ్ అయితే 9–10 శాతం మధ్య రిటర్న్‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది. కానీ, షేర్లతో రిస్క్ ఎక్కువ, గోల్డ్‌‌‌‌‌‌‌‌లో రిస్క్ తక్కువ.