వాట్సాప్ చాటింగ్లో మరికొంత సరదా.. కొత్తగా 21 ఎమోజీలు

వాట్సాప్ చాటింగ్లో మరికొంత సరదా.. కొత్తగా 21 ఎమోజీలు

వాట్సాప్ కు అలవాటు పడ్డ జనాలు..  ఈ మధ్య చాటింగ్ కి బదులుగా ఎమోజీలను, స్టిక్కర్లను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా మరికొంత ఫన్ ని యాడ్ చేయడానికి చాటింగ్ కోసం 21 కొత్త ఎమోజీలను తీసుకొస్తో్ంది. వీటిని వాడుకోవాలంటే ఎలాంటి డౌన్ లోడ్స్ చేయాల్సిన పనిలేదు. వాట్సాప్ చాటింగ్ కీ బోర్డులోనే అవి కనిపిస్తాయి. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం యూపికోడ్ 15.0 ద్వారా ఈ అప్ డేట్ తీసుకొచ్చారు. వీటిని వినియోగించాలంటే వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో ఉండాలని తెలిపింది. ఇప్పటికే అన్ నోన్ కాల్స్ మ్యూట్ అప్ డేట్ తీసుకొచ్చిన వాట్సాప్ మరికొన్ని అప్ డేట్స్ పై వర్క్ చేస్తున్నట్లు తెలిపింది.