వాట్సాప్లో కొత్త ఫీచర్ 

వాట్సాప్లో కొత్త ఫీచర్ 

న్యూఢిల్లీ: వినూత్న ఫీచర్లతో ఎప్పటికప్పుడు దూకుడు ప్రదర్శించడంలో వాట్సాప్ ముందుంటుంది. యూజర్ ఫ్రెండీ యాప్ అయిన వాట్సాప్.. ఈసారి సరికొత్త అప్డేట్స్ తీసుకురానుంది. కొత్త వాయిస్ కాల్ ఇంటర్ఫేస్, ఎమోజీల కోసం షార్ట్కట్, అప్డేటెడ్ వాయిస్ నోట్ ఫార్వర్డ్ వంటి ఫీచర్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్టింగ్ కోసం ఈ కొత్త ఫీచర్లను పలువురు బెటా యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. 

ప్రత్యేకంగా గ్రూప్ వాయిస్ కాల్స్ కోసం ఈ ఫీచర్ను తీర్చిదిద్దారని తెలుస్తోంది. వాయిస్ కాల్ సమయంలో ఈ ఫీచర్ గ్రూప్లోని ప్రతి ఒక్కరికీ రియల్ టైమ్ వేర్ఫారమ్లను చూపుతుంది. తద్వారా వాయిస్ కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు మ్యూట్లో ఉన్నారో సులువుగా తెలుసుకునేందుకు వీలుంటుంది. అలాగే ఈ కొత్త ఇంటర్ఫేస్లో వాల్పేపర్లను కూడా వాట్సాప్ విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫార్వర్డ్ వాయస్ నోట్స్, ఆడియో ఫైల్ల మధ్య తేడాలను గుర్తించడానికి మరో సరికొత్త ఫీచర్ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫార్వర్డ్ చేసిన వాయిస్ నోట్స్ ఇకపై నారింజ రంగులో కనిపించనున్నాయి. అలాగే ఇతరులతో చాటింగ్ చేస్తున్న సమయంలో ఎమోజీని త్వరగా ఎంచుకోవడానికి వాట్సాప్ షార్ట్కట్లు తీసుకొస్తుంది. అయితే, ఈ ఫీచర్లు ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. త్వరలోనే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకూ అందుబాటులోకి వస్తుందని కచ్చితంగా చెప్పలేమని టెక్ నిపుణులు అంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

బాలయ్య కొత్త లుక్ అదిరింది

అల్లు అర్జున్ మూవీకి అరుదైన గౌరవం

హిట్మ్యాన్ కెప్టెన్సీలో భారత్ మరో ఘనత