బాలయ్య కొత్త లుక్ అదిరింది

బాలయ్య కొత్త లుక్ అదిరింది

హైదరాబాద్: అఖండ గ్రాండ్ విక్టరీ సాధించడంతో జోరు మీదున్న నందమూరి నటసింహం బాలకృష్ణ 107వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘క్రాక్’ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మైనింగ్ గనుల ముందు.. బ్లాక్ కలర్ షర్ట్, పక్కన ల్యాండ్ రోవర్ కారుతో బాలయ్య మాస్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన లుక్ సరికొత్తగా ఉంది. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్, బాలయ్య కాంబోలో వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. అఖండకు సంగీతం అందించిన తమన్.. ఈ సినిమాకూ బాణీలు సమకూర్చుతున్నాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

అల్లు అర్జున్ మూవీకి అరుదైన గౌరవం

హిట్మ్యాన్ కెప్టెన్సీలో భారత్ మరో ఘనత

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా