హిట్మ్యాన్ కెప్టెన్సీలో భారత్ మరో ఘనత

హిట్మ్యాన్ కెప్టెన్సీలో భారత్ మరో ఘనత

న్యూఢిల్లీ: వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20లో 17 రన్స్ తేడాతో గెలిచిన భారత్.. మ్యాచుతోపాటు 3–0 తేడాతో సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన కొత్త ఘనత సాధించింది. టీ20 క్రికెట్ లో ఆరేళ్ల తర్వాత నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. చివరిసారి 2016లో ఈ ఫార్మాట్ లో నంబర్ 1గా నిలిచింది. అప్పటి నుంచి మళ్లీ ఇన్నాళ్లకు భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. చివరగా ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2016, ఫిబ్రవరి 12 నుంచి మే 3 వరకు టీమిండియా టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగింది. 

ఐసీసీ తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్స్ లో.. పాయింట్ల పట్టికలో ఇదివరకు నంబర్ 1 ప్లేస్ లో ఉన్న ఇంగ్లాండ్ ను భారత్ అధిగమించింది. ఇప్పుడు టీమిండియా 269 రేటింగ్ తో కొనసాగుతోంది. మరోవైప్ ఇంగ్లాండ్ కూడా అంతే రేటింగ్ తో సమానంగా ఉన్నప్పటికీ.. పాయింట్ల పరంగా వెనుకంజలో ఉంది. ఇక పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

అల్లు అర్జున్ మూవీకి అరుదైన గౌరవం

దాణా స్కాంలో లాలూ ప్రసాద్కు శిక్ష ఖరారు

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా