వాయిస్ మేసేజ్ కోసం.. వాట్సప్లో మరో కొత్త ఫీచర్..

వాయిస్ మేసేజ్ కోసం.. వాట్సప్లో మరో కొత్త ఫీచర్..

వినియోగదారుల భత్రద, సౌకర్యం కోసం ఇన్ స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సప్.. రోజుకో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. ఇటీవల పాస్ వర్డ్ లెస్ పాస్ కీ  ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా సంస్థ.. తాజాగా వాట్సప్ లో వాయిస్ మేసేజ్ లకోసం View Once మోడ్ ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకసారి మాత్రమే వినగలిగే వాయిస్ మెసేజ్ లను పంపేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్ బెటా వెర్షన్ ని వినియోగించే Android, iOS  కస్టమర్లకోసం టెస్టింగ్ దశలో  ఉంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది. 

వాయిస్ నోట్స్ కోసం View Once  మోడ్ ప్రారంభించాలంటే.. కస్టమర్లు రికార్డింగ్ సమయంలో వాయిస్ నోట్ వేవ్ ఫార్మ్ కి కుడివైపున కనిపించే 1 గుర్తును నొక్కాలి. ఈ మోడ్ ప్రారంభించిన వాయిస్ నోట్ పంపిన తర్వాత వాయిస్ పంపినవారు, రిసీవ్ చేసుకున్నవారు ఒకసారి మాత్రమే వినగలుగుతారు.. రెండో సారి వినే ఛాన్స్ లేదు. 

View Once  భద్రత, నియంత్రణతో  ఫీచర్ ద్వారా వాయిస్ నోట్ షేరింగ్ చేయొచ్చు. ఒకసారి View Once మోడ్ లో వాయిస్ మేసేజ్ పంపిస్తే.. దానిని డౌన్ లోడ్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం జరగలేదు. వాయిస్ మేజేస్ పంపించేవారు కూడా ఈ వాయిస్ నోట్ ను రికార్డు చేయలేరు, సేవ్ చేయలేరు. ఇది వాయిస్ మేసేజ్ పంపేవారికి ప్రైవసీ, కంటెంట్పై నియంత్రణ ఉంటుంది. వాట్సప్ ఇప్పటికే ఫొటోలు, వీడియోలకోసం ఈ ఫీచర్ ను అందిస్తుంది.2021 నుంచి ఫొటోలు, వీడియోలకోసం View Once మోడ్ ను అందుబాటులోకి తెచ్చింది.