Watsapp: పెగాసస్ స్పై వేర్ కేసులో.. రూ.14 వందల కోట్లు గెలుచుకున్న వాట్సాప్

Watsapp: పెగాసస్ స్పై వేర్ కేసులో..  రూ.14 వందల కోట్లు గెలుచుకున్న వాట్సాప్

పెగాసస్ స్పైవేర్.. వాట్సాప్ లో చొరబడి మీకు తెలియకుండానే మీ డేటా చోరీ చేసే వైరస్ లాంటిది. సైబర్ క్రైమ్ లో ప్రపంచాన్నే వణికించిన స్పైవేర్ ఇది. మీరు  ఎవరితో చాట్ చేస్తున్నారు.. సీక్రెట్స్ ఏంటి.. ఎవరితో సంబంధాలు ఉన్నాయి..? ఇలా అనేక కోణాలలో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం.. ప్రభుత్వాలకు లేదా ఇతర ఏజెన్సీలకు ఆ డేటాను అమ్ముకోవడం దీని వెనుక ఉన్న నిగూఢ రహస్యం. వాట్సాప్ కేంద్రంగా దీన్ని వినియోగించారని వాట్సాప్ మాతృ సంస్థ మెటా గత ఆరేళ్లుగా చట్టపరంగా పోరాడుతోంది. 

ఇజ్రాయెల్ కు చెందిన కంపెనీ ఎన్.ఎస్.ఓ ( NSO ) గ్రూప్ ఈ స్పైవేర్ ను తయారు చేసింది. వాట్సాప్ ప్లాట్ ఫామ్ ను వినియోగించుకుని మాల్ వేర్ ను పంపించి డేటాను చోరీ చేయడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 

పెగాసస్ స్పై వేర్ కేసులో దాదాపు ఆరేళ్ల యుద్ధంలో వాట్సాప్ గెలిచింది. దాదాపు 20 దేశాలలో 14 వందల మంది ప్రముఖుల వాట్సాప్ లను హ్యాక్ చేసి కీలక సమాచారం సేకరించిన కేసులో ఎట్టకేలకు వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా గెలిచింది. ముఖ్యంగా జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తల వాట్సాప్ లను హ్యాక్ చేసి డేటా సేకరించిందనే కేసులో ఆరేళ్లుగా చేసిన చట్టబద్ధమైన పోరాటంలో మెటా గెలిచింది. 

డిసెంబర్ 2024 లో NSO గ్రూప్ కంప్యూటర్ ఫ్రాడ్ చేసిందని, వాట్సాప్ లో స్పై వేర్ ద్వారా సైబర్ క్రైమ్ కు పాల్పడిందని యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ కు చెందిన జడ్జి ఫైలిస్ హామిల్టన్  తీర్పు వెలువరించారు. అదే తీర్పును కొనసాగిస్తూ తాజాగా మంగళవారం (మే 6 యూఎస్ కాలమానం ప్రకారం) .. మెటా ఆరోపిస్తున్నట్లుగా  NSO గ్రూప్ ఫ్రాడ్ కు పాల్పడిందని తేల్చిచెప్పింది. అందుకు గానూ వాట్సాప్ డ్యామేజ్ కు పాల్పడినందుకు.. రూ.3 కోట్ల కంపెన్సేటరీ తో పాటు 1414.856 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ట్రయల్ కోర్టు ఆదేశించింది. 

►ALSO READ | Pakistan Stock Market: భారతదాడితో కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు.. కరాచి ఎక్స్ఛేంజ్ ఫసక్

ఈ తీర్పుపై వాట్సాప్ ప్రతినిధి కార్ల్ వూగ్ స్పందిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న NSO గ్రూప్ కు ఇది స్ట్రాంగ్ వార్నింగ్ అని అభివర్ణించారు. అమెరికా సంస్థలను టార్గెట్ చేసి ప్రైవసీని దెబ్బకొట్టాలని చూసే వారికి ఇది బలమైన హెచ్చరిక అని అన్నారు. అయితే NSO గ్రూప్ మాత్రం అమెరికా ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ వినియోగించలేదని, ముఖ్యంగా వాట్సాప్ లో ఎలాంటి స్పై జరపలేదని మరోసారి ఉద్ఘాటించింది.