Biker vs Akhanda 2: డిసెంబర్ 5న థియేటర్స్ బద్దలే.. బాలకృష్ణకు పోటీగా శర్వానంద్.. భారీ ధరకు OTT రైట్స్!

Biker vs Akhanda 2: డిసెంబర్ 5న థియేటర్స్ బద్దలే.. బాలకృష్ణకు పోటీగా శర్వానంద్.. భారీ ధరకు OTT రైట్స్!

టాలీవుడ్‌ టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘బైకర్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది. డిసెంబర్ 5న బాలకృష్ణ అఖండ 2తో పాటు ‘బైకర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా బైకర్ మూవీలో బైక్ రైడర్గా శర్వా కనిపించబోతున్నారు. రోల్కి తగ్గట్టుగానే శర్వా 'రేసర్‌'గా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇందులో శర్వాకి జోడీగా మాళవిక నాయర్ నటిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ సినిమాని స్టైలిష్గా తెరకెక్కించారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేసిన శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, ఫస్ట్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బైక్ రేసింగ్ విజువల్స్, శర్వా లుక్ మరియు ప్రొడక్షన్ డిజైన్ వీపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ఇక్కడ ప్రతి బైకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ళ కథ’ అంటూ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశారు మేకర్స్. ట్రైలర్ మరియు సాంగ్స్ త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ‘బైకర్’ మూవీ ఓటీటీ వివరాలు బయటకి వచ్చాయి. 

►ALSO READ | శంబాల సర్ ప్రైజ్ చేస్తుంది

నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. బైకర్ వచ్చేది నెట్‌ఫ్లిక్స్ లోనే అనే ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే పోస్టర్లో అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ  స్పోర్ట్స్ డ్రామా మూవీకి ఓటీటీ డీల్ భారీ ధర పలికినట్లు టాక్. శర్వానంద్ ప్రీవియస్ మూవీస్ కంటే ఎక్కువగా, ఈ సినిమాకు ఓటీటీ డీల్ జరిగిందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్యలో మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, జనవరి 2026 ఫస్ట్ వీక్లో లేదా సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. త్వరలోనే బైకర్ పాటల నగారా షురూ అవ్వనుంది.

అఖండ 2 vs బైకర్:

బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ2 : తాండవం’ డిసెంబర్‌‌‌‌ 5న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, త్వరలో ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయనున్నారు. ఈ యాక్షన్ మైథలాజికల్ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. 'అఖండ 2' ఓటీటీ హక్కులు జియో హాట్‌స్టార్ లేదా నెట్‌ఫ్లిక్స్ కొనే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.

అయితే, పలు నివేదికల ప్రకారం, జియో హాట్‌స్టార్ అత్యధిక ధరకు 'అఖండ 2' అన్ని భాషల OTT హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. సుమారు రూ.85 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈ క్రమంలోనే అఖండ 2కి పోటీగా బైకర్ వస్తుండటంతో ఇంట్రెస్ట్ నెలకొంది. బాలయ్యను ఢీ కొట్టే సత్తా శర్వాకు ఉందా లేదా అనేది.. తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!!