సారీ.. ఇండియా మూడో స్టేజ్‌లో లేదు

సారీ.. ఇండియా మూడో స్టేజ్‌లో లేదు

వివరణ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ: ఇండియా విషయంలో తప్పు జరిగి పోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌‌‌‌వో) ఒప్పుకుంది. దేశంలో కరోనా వైరస్‌‌‌‌ కమ్యూనిటీ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో ఉందని తమ ‘సిచుయేషన్‌‌‌‌రిపోర్టు’లో తప్పుగా పేర్కొన్నామంది. ఇండియాలో వైరస్‌‌‌‌ విస్తృతి క్లస్టర్ల స్థాయిలోనే ఉందని, ఇంకా మూడో స్టేజ్‌‌‌‌లోకి వెళ్లలేదని తెలిపింది. ప్రస్తుతానికి తప్పును సరి చేశామంది. కేంద్ర ప్రభుత్వం కూడా దేశం మూడో స్టేజ్‌‌‌‌లోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. ‘దేశంమూడో స్టేజ్‌‌‌‌లో ఉంటే ముందు మేమే చెబుతాం. ప్రజలను అలర్ట్‌‌‌‌ చేస్తాం. మన దగ్గర కమ్యూనిటీ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌ లేదు’ అని హెల్త్‌‌‌‌ మినిస్ట్రీ జాయింట్‌‌‌‌ సెక్రటరీ లవ్‌ ‌‌‌అగర్వాల్‌ ‌‌‌చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హరవర్ధన్ కూడా స్పష్టంచేశారు. 600 జిల్లాల్లో 133 జిల్లాలను హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌లుగా గుర్తించామన్నారు. 400 జిల్లాల్లో వైరస్‌‌‌‌ ప్రభావం లేదని చెప్పారు.

For More News..

నో కాంటాక్ట్, నో ట్రావెల్ హిస్టరీ.. అయినా కరోనా ఎటాక్

100 రోజులు.. లక్ష మరణాలు

5 రోజుల్లోనే 3 వేల కరోనా కేసులు

లాక్ డౌన్ ఎఫెక్ట్.. క్వార్టర్ మందు రూ. 1,000