WHO డిసిన్​ఫెక్టెంట్స్ భేష్

WHO డిసిన్​ఫెక్టెంట్స్ భేష్

బెర్లిన్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ డిసిన్​ఫెక్టెంట్స్ కరోనాను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పని చేస్తున్నాయని ఓ స్టడీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న డిసిన్​ఫెక్టెంట్స్ కొరతను తీర్చడానికి ఫార్మసీలు సులువుగా, త్వరగా పూర్తయ్యే ఫార్ములేషన్స్ ను ప్రిపేర్​చేయొచ్చని జర్మనీలోని రుహ్ర్ యూనివర్సిటీ బొకుమ్ సైంటిస్టులు తెలిపారు. ఈ సైంటిస్టుల టీమ్ డబ్ల్యూహెచ్ వో సిఫార్సు చేసిన ఫార్ములేషన్స్ వద్ద సార్స్ కోవ్–2 అనే వైరస్ లను 30 సెకన్ల పాటు ఉంచి టెస్ట్ చేసింది. ఆ తర్వాత సెల్ కల్చర్ అస్సేస్ లో వైరస్ లను ఉంచి.. వాటిలో నుంచి ఎన్ని ఇన్ఫెక్ట్​అవుతాయని టెస్ట్ చేసింది. ఈ పరిశోధనలు డబ్ల్యూహెచ్ వో పరిష్కారాలకు వర్తించవని పేర్కొంది.