చూపు లోపాలు తగ్గినయ్

చూపు లోపాలు తగ్గినయ్

కంటి చూపు లోపాలను నివారించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పెట్టిన టార్గెట్ ను ఇండియా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. 2010 నాటితో పోలిస్తే 2019 నాటికి కంటి చూపు లోపాల (విజువల్ ఇంపెయిర్​మెంట్)ను 25% తగ్గించాలంటూ ‘గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ యూనివర్సల్ ఐ హెల్త్ 2014-–19’ ప్రోగ్రాం కింద ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ విధించింది. తాజాగా ‘నేషనల్ బ్లైండ్ నెస్ అండ్ విజువల్ సర్వే 2015–19’లో వెల్లడైన వివరాల ప్రకారం.. ఇండియా ఈ టార్గెట్ ను విజయవంతంగా చేరుకుంది. దేశంలోని వివిధ సంస్థల సహకారంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ సర్వేను నిర్వహించింది.

సర్వేలో ఏం తేలిందంటే…

2010 నాటి బేస్ లెవెల్​తో పోలిస్తే దేశంలో పూర్తిగా చూపు పోవడం 47.1%, మధ్యస్థాయి చూపు లోపాలు 52.6%, విజువల్ ఇంపెయిర్ మెంట్ 51.9% తగ్గాయి. ఇవన్నీ డబ్ల్యూహెచ్ఓ పెట్టిన టార్గెట్ కంటే ఎక్కువే కావడం గమనార్హం.

దేశంలో పూర్తిగా చూపు పోయిన వాళ్లు 0.36%, చూపు లోపాలున్న వారు 0.35%, ఎర్లీ విజువల్ ఇంపెయిర్ మెంట్ ఉన్నోళ్లు 2.92% ఉన్నారు.

50 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారిలో పూర్తిగా చూపు పోవడం 2001లో 5.3 శాతం ఉండగా, 2007 నాటికి 3.60 శాతానికి, తాజాగా 1.99 శాతానికి తగ్గింది. విజువల్ ఇంపెయిర్ మెంట్ 2001లో 32.3 శాతం ఉండగా, 2007లో 24.8 శాతానికి, తాజాగా13.73 శాతానికి తగ్గింది.

దేశంలో కాటరాక్ట్‌‌ వల్లే ఎక్కువ మంది (66.2) అంధులుగా మారిపోతున్నారు.

పూర్తిగా చూపు పోవడం తక్కువ ఉన్న జిల్లాగా కేరళలోని త్రిసూర్, విజువల్ ఇంపెయిర్ మెంట్ అతి తక్కువగా ఉన్న జిల్లాగా మణిపూర్ లోని తౌబాల్ నిలిచాయి. ఈ రెండూ ఎక్కువగా ఉన్న జిల్లాగా యూపీలోని బిజ్నోర్ నిలిచింది.

80+ ఏజ్ గ్రూప్ వాళ్లలో 11.6%, 70+ వాళ్లలో 4.1%, 60+ వాళ్లలో 1.6%, 50+ వాళ్లలో 0.5% మంది అంధత్వం బారిన పడ్డారు.

చదువుకోని వాళ్లలో బ్లైండ్ నెస్ శాతం (3.23%) ఎక్కువగా ఉంది. పది, అంతకంటే ఎక్కువ చదివిన వాళ్లలో 0.43% మాత్రమే ఉంది.

పట్టణాల్లో 1.80% బ్లైండ్ నెస్ ఉండగా, గ్రామాల్లో 2.14% ఉంది.

0–49 ఏండ్ల మధ్య వాళ్లలో ప్రతి వెయ్యి మందిలో 4.43% మంది విజువల్ ఇంపెయిర్ మెంట్ తో, 0.52% మంది బ్లైండ్​నెస్​తో బాధపడుతున్నారు.