Miss Universe India-2025: మిస్ యూనివర్స్ ఇండియాగా మణిక విశ్వకర్మ.. ఎవరీమె?

Miss Universe India-2025: మిస్ యూనివర్స్ ఇండియాగా మణిక విశ్వకర్మ.. ఎవరీమె?

మిస్ యూనివర్స్ ఇండియా -2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకుంది. జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' పోటీల్లో ఆమె గెలుపొందారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా.. మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ ఏడాది నవంబర్ లో థాయ్ లాండ్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున మణిక ప్రాతినిధ్యం వహించనుంది.

ఇక ఈ పోటీల్లో ఉత్తర్ ప్రదశ్ కు చెందిన తాన్య శర్మఫస్ట్ రన్నరప్ గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్ గా నిలిచారు. హర్యానా అమ్మాయి అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్ లో పుట్టిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. క్లాసికల్ డ్యాన్సర్. జా తీయస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు సొంతం చేసుకున్నా రు. చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉంది. గతేడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్- 2024 టైటిలును కూడా కైవసం చేసుకున్నారు. 

మణికకు సమాజ సేవ కూడా ఎక్కువే.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించారు. న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సేవలు అందిస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. "నా ప్రయాణం నా స్వస్థలం గంగానగర్ నుంచి ప్రారంభమైంది. అక్కడినుంచి ఢిల్లీకి వచ్చి ఈ పోటీకి సిద్ధమయ్యాను. మనపై మనం నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నా విజయం వెనక ఎంతోమంది ఉన్నారు. నాకు సాయం చేస్తూ నన్ను ప్రోత్సహించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞత లు' అని చెప్పుకొచ్చారు.