Ragini Das..ఆ రోజు వద్దన్నారు..ఈ రోజు వారికే బాస్..రాగిణీ దాస్..టెక్ ప్రపంచంలో తిరుగులేని స్ఫూర్తి

Ragini Das..ఆ రోజు వద్దన్నారు..ఈ రోజు వారికే బాస్..రాగిణీ దాస్..టెక్  ప్రపంచంలో తిరుగులేని స్ఫూర్తి

సవాళ్లను కూడా అద్భుతమైన అవకాశంగా మార్చుకోవడం ఎలాగో నిరూపించిన స్ఫూర్తిదాయక కథ ఇది. ఒకప్పుడు తాను అప్లయ్​ చేసినప్పుడు తిరస్కరణకు గురైన అదే సంస్థలో అత్యున్నత పదవిని అలంకరించారు రాగిణీ దాస్. ఇప్పుడు ఆమె గూగుల్​ ఇండియా స్టార్టప్​కు కొత్త హెడ్.. అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు అదే కంపెనీకి బాస్.. ఈ అద్భుత ప్రయాణం, పట్టుదల ,ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి చాటిచెబుతోంది. గూగుల్​ ఇండియా స్టార్టప్​ వ్యవస్థను ముందుకు నడిపించేందుకు ఆమె ఎలాంటి దృష్టితో ముందుకు సాగనున్నారు? రాగిణీ దాస్​ కెరీర్​ మలుపులు ఏమిటో తెలుసుకుందాం..

గూగుల్ ఇటీవలే రాగిణి దాస్‌ను గూగుల్ ఇండియాలో స్టార్టప్‌ల కొత్త హెడ్‌గా నియమించింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ క్లబ్ leap.club  సంస్థ కోఫౌండర్​ గా ఆమె సక్సెస్​ అయిన రాగిణీ దాస్​.. అదే ఊపుతో తిరస్కరించిన కంపెనీలోనే హెడ్​ గా బాధ్యతలు చేపట్టింది.  ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ ,లెబనాన్‌తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జొమాటో గోల్డ్‌ను విజయవంతంగా ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన రాగిణీ దాస్​.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు గూగుల్​ ఇండియా తరపున ఆమె, ఆమె టీం సలహాలు సూచనలు ఇస్తూ ఆ కంపెనీల అభివృద్దికి సపోర్టు చేస్తుంది.తన నియామకాన్ని దాస్ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం Xలో పంచుకున్నారు. తన జీవితంలో మలుపులను షేర్ చేసింది. 

ఎవరీ రాగిణీ దాస్​..?

రాగిణీ దాస్​.. 2013లో గూగుల్​ సంస్థకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వెళ్లి తిరస్కరించబడిన టెకీ.. ఆ తర్వాత జొమాటోలో జాబ్​ తో జీవితం ప్రారంభించింది. జొమాటో లో వచ్చిన అనుభవంతో leap.club సంస్థను కోఫౌండర్​ గా స్థాపించింది. సక్సెస్ అయింది. అయితే తాజాగా ఉన్నట్టుండి గూగుల్​ లో అవకాశం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ లకు బాస్​ గా గూగుల్​ ఇండియా తరపున ఎంపికైంది. 

రాగిణీదాస్​. గురుగ్రామ్​ పుట్టారు. చెన్నైలోని చెట్టినాడ్​ విద్యాశ్రమంలో పాఠశాల విద్య, అక్కడే సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత లాంకాస్టర్​ యూనివర్సిటీనుంచి బిజినెస్​ అడ్మినిస్ట్రేషన్​ లో బ్యాచిలర్​ డిగ్రీని పొందారు. ఆసమయంలోనే స్టాండర్డ్​ చార్టర్డ్​ బ్యాంక్​తో సహా పలు సంస్థలతో ఇంటర్న్​ చేయడం ద్వారా  వచ్చిన అనుభవంతో మార్కెట్​ పరిశోధనపై దృష్టి పెట్టింది. భారతీయ మార్కెట్​ కోసం వ్యాపార వృద్ధి ప్రణాళికలను డెవలప్​ చేసింది. 

జొమాటోలో ఆరేళ్లు..

2013లో జొమాటోలో సేల్స్ ,మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు దాస్. ఆమె ఆరేళ్ల పదవీకాలంలో కీ అకౌంట్ మేనేజర్ ,ఏరియా సేల్స్ మేనేజర్‌తో సహా వివిధ పాత్రల ద్వారా ముందుకు సాగింది. 2017లో జొమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగంగా ఉంది. కస్టమర్ల పెరుగుదల, ఎంగేజ్,ఉత్పత్తి మార్కెటింగ్‌పై పనిచేసింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ ,లెబనాన్‌తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జొమాటో గోల్డ్‌ను విజయవంతంగా ప్రారంభించడంలో కీరోల్​ ప్లే చేసింది. 

leap.club కోఫౌండర్​ గా.. 

2020లో దాస్ మహిళల కోసం అంకితమైన ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ క్లబ్ అయిన leap.club ను -స్థాపించారు. ఈ ప్లాట్‌ఫాంనెట్‌వర్కింగ్, వృత్తిపరమైన అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్‌లను విజయవంతంగా అందించింది. రాగిణి దాస్ FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీకి చైర్‌పర్సన్ గా కూడా పనిచేస్తున్నారు. పట్టుదల ,ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి చాటిచెబుతోంది రాగిణీ దాస్.