మిస్టరీ ఎంటీ : ఎవరీ యువకులు..లోక్ సభలోకి ఎలా వచ్చారు.. కలర్ గ్యాస్ ఎలా ప్రయోగించారు..?

మిస్టరీ ఎంటీ : ఎవరీ యువకులు..లోక్ సభలోకి ఎలా వచ్చారు.. కలర్ గ్యాస్ ఎలా ప్రయోగించారు..?

బుధవారం( డిసెంబర్13) న లోక్సభలో అనూహ్య పరిణామం జరిగింది. 20 ఏళ్ళ ఇద్దరు యువకులు లోక్ సభలో గందళగోళం సృష్టించారు. కేవలం ఇద్దరు యువకులు వందల మంది ఎంపీలను పరుగులు పెట్టించారు. తమ వెంట తెచ్చుకున్న పసుపు రంగు స్ప్రేను వదిలారు. అనూహ్య పరిణామానికి స్పీకర్ లోక్ సభను వాయిదా వేశారు.. ఇంతకీ ఎవరీ యువకులు .. లోక్ సభలోకి ఎలా వచ్చారు. కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్ సభ జరుగుతుండగా.. ఆ ఇద్దరు యువకులు ఎలా సభలోకి దూసుకు వచ్చారు. ఇవే ఇప్పుడు అందరి మెదళ్లలో తిరుగుతున్న ప్రశ్నలు.

పార్లమెంట్ చుట్టూ మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఎలాంటి ఐడీ కార్డు లేకుండా ఎవర్నీ లోపలికి పంపించారు. లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు చూడటానికి వెళ్లాలన్నా.. గ్యాలరీలోకి వెళ్లాలన్నా కనీసం రికమండేషన్ లెటర్ ఉండాలి.. మీడియా అయినా సరే కంపెనీ ఐడీ కార్డు.. అనుమతి పత్రం ఉండాలి.ఇక గ్యాలరీలోకి వెళ్లాలంటే ఎంపీల సిఫార్సు లేఖ ఉండాల్సిందే. ఎంపీల పీఏలకు ప్రత్యేక ధృవీకరణ కార్డులు ఉంటాయి.. పార్లమెంట్ ఆవరణలోకి ఎవరు పడితే వాళ్లు.. ఎలా పడితే అలా వెళ్లటానికి అవకాశం ఉండదు. అలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉంటే పార్లమెంట్ లోకి ఇద్దరు యువకులు వెళ్లటం.. గ్యాలరీలోకి వెళ్లటం.. వాళ్లు కలర్ గ్యాస్ క్యాన్స్ తీసుకెళ్లటం ఎలా సాధ్యం అయ్యిందనే ప్రశ్నలు.. పార్లమెంట్ ఎంపీల్లో వినిపిస్తున్నాయి. 

సభ ప్రారంభమైన కొద్ది  సేపటికే విసిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూసుకువచ్చారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.. సభలో తమ వెంట తెచ్చుకున్న బాటిళ్లలోని స్పేను వదిలారు. దీంతో సభ మొత్తం పసుపురంగు స్ప్రేతో నిండిపోయింది. యువకులను ఎంపీలు అడ్డుకోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.