విఠల్ మణియార్.. పవార్ ఫ్యామిలీకి ఆత్మ.. తెర వెనక నడిపేది అంతా ఇతనే..!

విఠల్ మణియార్.. పవార్ ఫ్యామిలీకి ఆత్మ.. తెర వెనక నడిపేది అంతా ఇతనే..!

ముంబై: ఎన్సీపీ చీఫ్​, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ హఠాన్మరణంతో పవార్ ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలో పవార్ ఫ్యామిలీ మెంబర్స్‎ను ఓ అపరిచిత వ్యక్తిఓదార్చడం చర్చనీయాంగా మారింది. బోరున విలపిస్తోన్న అజిత్ పవార్ భార్య సునేత్రా పవర్, ఆయన సోదరి సుప్రియా సులేను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ధైర్యం చెప్పిన వీడియో ఇంటర్నెట్‎లో వైరల్‎గా మారింది.

దీంతో కష్టకాలంలో పవార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది. పలువురు ఆయన గురించి నెట్టింట ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు పవార్ ఫ్యామిలీ మెంబర్స్‎ను ఓదార్చిన ఆ వ్యక్తి విఠల్ సేథ్ మణియార్ అని తేలింది. పవార్ ఫ్యామిలీకి ఈయన ఆత్మ వంటివారని.. తెర వెనక నడిపేది అంతా ఇతనేనని తెలిసింది. 


ఎవరీ విఠల్ మణియార్..?

ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్‎కు విఠల్ సేథ్ మనియార్ అత్యంత సన్నిహితుడు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన మణియార్ పవార్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్. రాజకీయాల్లో తొలినాళ్ల నుంచి ఆయన శరద్ పవార్‎కు అండ ఉంటూ వస్తున్నారు. శరద్ పవార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మణియార్ ఆయనతోనే ఉంటున్నారు. శరద్ పవార్, మణియార్ తొలిసారి కాలేజీలో కలుసుకున్నారు. కాలేజీ స్టూడెంట్ ఎన్నికల్లో ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ ఎన్నికలో శరద్ పవార్ విజయం సాధించగా.. మణియార్ ఓటమి పాలయ్యాడు. అలా కాలేజీలో మొదలైన వీరి స్నేహం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 

►ALSO READ | వీధి కుక్కల కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

శరద్ పవార్‎తో పాటు పవార్ కుటుంబంలో కీలక నాయకులైన అజిత్ పవార్, సుప్రియా సూలే, సునేత్రా పవార్‎తో కూడా మణియార్‎కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మణియార్‎ను పవార్ కుటుంబానికి ఆత్మ అంటుంటారు ఎన్సీపీ వర్గాలు. పవార్ కుటుంబ సభ్యులు కూడా మణియార్‎ను సొంత కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేస్తారు. విద్యా ప్రతిష్టాన్, పవార్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్, ఇతరాలతో సహా పవార్ నేతృత్వంలోని దాదాపు అన్ని ప్రధాన సంస్థలకు ఆయన ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 

పవార్ ఫ్యామిలీకి అత్యంత దగ్గరి వ్యక్తి అయిన మణియార్ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టలేదు. కేవలం పవార్ కుటుంబానికి ఆత్మగా ఉంటూ తెరవెనక చక్రం తిప్పుతుంటారు. ​​అయితే.. అజిత్ పవార్ చనిపోయిన రోజు పవార్ సతీమణి సునేత్రా, ఆయన సోదరి సుప్రియా సులే మణియార్‎ను పట్టుకుని విలపించడంతో ఆయన లైమ్ లైట్‎లోకి వచ్చారు. ఈ ఘటనతో పవార్ కుటుంబంతో మణియార్‎కు ఎంత దగ్గరి సంబంధం ఉందో వెలుగులోకి వచ్చింది.