చైనాను ఫాలో అవ్వాలి: డబ్ల్యూహెచ్​వో

చైనాను ఫాలో అవ్వాలి: డబ్ల్యూహెచ్​వో

జెనీవా: కరోనా మృతుల సంఖ్యను సవరించడంలో అన్ని దేశాలూ చైనాను అనుసరిస్తాయని భావిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఆల్ కంట్రీస్ డెత్ కౌంట్ ను రివైజ్ చేస్తాయని అనుకుంటున్నట్లు పేర్కొంది. గత డిసెంబర్ లో కరోనా వైరస్ వూహాన్ లో కల్లోలం సృష్టించిందని చెప్పిన డబ్ల్యూహెచ్ వో.. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కరి వివరాలను అక్కడి అధికారులు నమోదు చేశారని వివరించింది. కాగా, వూహాన్ అధికారులు కరోనా మరణాల సంఖ్యను ఎప్పటికప్పుడు మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కరోనా డెత్ కౌంట్ లెక్కింపులో తాము తప్పు చేశామని వూహాన్ భూకంప కేంద్రం ఒప్పుకుంది. అకస్మాత్తుగా వూహాన్ మృతుల సంఖ్యను 50 శాతం ఎక్కువ చేసి ప్రకటించింది. దీంతో చైనా పారదర్శకతపై అనేక దేశాలు సందేహాం వ్యక్తం చేస్తున్నాయి.