V6 News

అహ్మదాబాద్‌లో నేడు KKR vs GT పోరు.. ఏ జట్టు గెలుస్తుందో తెలుసా!

అహ్మదాబాద్‌లో నేడు KKR vs GT పోరు.. ఏ జట్టు గెలుస్తుందో తెలుసా!

ఐపీఎల్ 2026లో నేడు అసలైన "హై-వోల్టేజ్" డ్రామాకు రంగం సిద్ధమైంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఫేస్-ఆఫ్ రికార్డులు చూస్తే 3- 1తో గుజరాత్ దే "అప్పర్ హ్యాండ్". పాయింట్ల పట్టికలో గిల్ సేన 6వ స్థానంలో ఉండగా.. పాపం కేకేఆర్ మాత్రం ఇంకా అట్టడుగునే ఉంది. ఈ మ్యాచ్‌తోనైనా "కం బ్యాక్" ఇవ్వాలని కోల్‌కతా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

పిచ్ రిపోర్ట్:  
అహ్మదాబాద్ పిచ్ అంటేనే "రన్ మెషీన్".. ఇక్కడ బంతి బ్యాట్‌లోకి దూసుకొస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. మొదట బ్యాటింగ్ చేసి 220 నుంచి -225 స్కోరు బోర్డుపై పెడితే ప్రత్యర్థికి "చుక్కలు" కనిపించడం గ్యారెంటీగా కనిపిస్తుంది.  
* మొదటి ఇన్నింగ్స్ అంచనా: 228/5 (పవర్‌ప్లే: 67/1)
* రెండవ ఇన్నింగ్స్ అంచనా: 204/8 (పవర్‌ప్లే: 65/2)

ఎవరిది పైచేయి?: 
ప్రస్తుత జట్ల బలాబలాలని పరిశీలిస్తే, గుజరాత్ టైటాన్స్ జట్టులోని జోస్ బట్లర్, రషీద్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్. మరోవైపు కేకేఆర్ ఇంకా సరైన కాంబినేషన్ కోసం వెతుకుతోంది. కాబట్టి, నేటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

►ALSO READ | సరికొత్త టీ20 టోర్నీకి శ్రీకారం చుట్టిన ఐసీసీ.. భారత్కు మాత్రం నో పర్మిషన్