దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారంటే..!

దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారంటే..!

పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా వాళ్లకు పాలపిట్ట మొదట కనిపించిందట! అప్పటినుంచి వాళ్లు వరుస విజయాలు సాధించారు. అందుకే విజయదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్టను చూడాలనే నమ్మకం ఏర్పడింది. దసరా రోజు సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్లకు పూజ చేసి... ఆ తర్వాత పాలపిట్ట దర్శనానికి వెళ్తారు అంతా. దానివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని, దోషాలు తొలగి చేసే పనిలో విజయం దక్కుతుందని నమ్ముతారు.