ఏపీ, తెలంగాణలో నంది అవార్డ్స్ ఎందుకివ్వటం లేదు : నట్టికుమార్

ఏపీ, తెలంగాణలో నంది అవార్డ్స్ ఎందుకివ్వటం లేదు : నట్టికుమార్

నంది అవార్డ్స్ పై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు అవార్డ్స్ ని ఇవ్వట్లేదని నట్టి కుమార్ నిలదీశారు.పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఆయన..  ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదంతా తెలియాలనే ఈ  ప్రెస్ మీట్ పెట్టానని స్పష్టం చేశారు.

 ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కొత్తసినిమాలు టీవీలో ప్లే చేస్తామని అన్నారని,  కానీ దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదని నట్టి కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రెస్ మీట్ కూడా విభజించి, పాలించు అనే ధోరణిలోనే జరిగిందంటూ ఆరోపించారు. ఇక నంది అవార్డ్స్ పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి అలా మాట్లాడటం సరైన పద్దతి కాదని నట్టి కుమార్ అన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి కులాలు లేవని, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళదంతా ఒక్కటే కులమని, అదే సినిమా కులమని వ్యాఖ్యానించారు. నంది అవార్డ్స్ టైంలో జ్యూరీలో ఉన్నవాళ్ళు కొన్ని తప్పులు చేశారన్న ఆయన... వాళ్ళ దగ్గరి వాళ్లకే అవార్డ్స్ ఇచ్చారని వార్తలు వస్తున్నట్టు నట్టి కుమార్ చెప్పారు.