జబ్బుల గురించి ఇంటర్నెట్‌లో ఎందుకు వెతకకూడదో తెలుసా..

V6 Velugu Posted on Aug 20, 2021

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దాంతో చాలామంది తమకు కావలసిన దాని గురించి నెట్ లో వెతికి తెలుసుకుంటున్నారు. అయితే చాలామంది తమకున్న వ్యాధులు, లక్షణాలు మరియు ఇతర సమస్యల గురించి కూడా నెట్ సెర్చ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని చాలామందికి తెలియదని డాక్టర్ అబ్రార్ ముల్తానీ అంటున్నారు. 

నెట్ లో వ్యాధుల గురించి వెతకడం వల్ల ఒక్కోసారి తప్పుడు సమాచారం లభించవచ్చు. అందుకే మనం వెతుకున్న సమాచారం.. ప్రామాణికమైనదా కాదా అని చెక్ చేసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని ఫాలో అయితే మరింత అనారోగ్యం బారినపడే అవకాశముంది. రోగి తన సమస్యను నెట్ లో వెతికే లక్షణాన్ని సైబర్‌కాండ్రియా అంటారు. 

ఉదాహరణకు, తలనొప్పి నివారణ కోసం మనం నెట్ లో సెర్చ్ చేస్తే..  అలసట నుంచి బ్రెయిన్ ట్యూమర్ వరకు ప్రతిదీ మనకు అందుబాటులోకి వస్తుంది. రోగి తనకున్న లక్షణాలను ట్యూమర్ గా భావిస్తే తీవ్ర సమస్యలు వస్తాయి. తనకు ట్యూమర్ సమస్య ఉందేమోననే కారణంగా.. రోగికి సరిగా నిద్ర ఉండదు. దాంతో రోగి సాధారణ సమస్యను మరింత తీవ్రమవుతుంది. రోగి తనకున్న సాధారణ దగ్గు లేదా నొప్పిని తీవ్రమైన అనారోగ్యంగా భావించి డాక్టర్ ను సంప్రదిస్తాడు. దాంతో డాక్టర్లు అనవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. గ్యాస్ వల్ల ఛాతీ మంట వస్తే.. డాక్టర్ దానిని గుండెపోటు లక్షణంగా భావించి.. అనవసరంగా ECG, ఎకో వంటి పరీక్షలు రాస్తారు. దాంతో రోగికి ఆర్థికంగా కూడా నష్టం కలుగుతుంది. ఇలా జరగడానికి కారణం కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణమవుతుంటారు. వీటన్నింటి వల్ల రోగిలో తీవ్ర భయం దరిచేరుతుంది.

సైబర్‌కాండ్రియాకు ఎలా ఎదుర్కోవాలంటే.. 
అనవసరమైన భయం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి.. ఇంటర్నెట్‌లో లభించే సమాచారాన్ని ఫైనల్ గా పరిగణించవద్దు.
నిపుణుల నుంచి సమాచారాన్ని తీసుకొని అందుబాటులో ఉండే వెబ్‌సైట్‌లలో మాత్రమే సమాచారాన్ని చూడాలి.
మీకు ఏదైనా వ్యాధి లేదా లక్షణాలు ఉంటే నేరుగా డాక్టర్‌ని సంప్రదించడం మేలు.
డాక్టర్ అనుమతి లేకుండా సొంత వైద్యం చేసుకొని అనారోగ్యం పాలుకావద్దు. 

Tagged health, internet, diseases, search about diseases on the internet

Latest Videos

Subscribe Now

More News