వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం

వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మద్దతుగా కాంగ్రెస్​ శ్రేణులు, అభిమానులు, వివిధ ప్రజాసంఘాలు శనివారం విస్తృత ప్రచారం చేశారు. పెద్దపల్లిలో యూత్​కాంగ్రెస్​ నాయకుడు కొండి సతీశ్, మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బొంకూరి కైలాసం, మంథని ప్రెస్​ క్లబ్​లో మాదిగ రిజర్వేషన్​ పోరాట సమితి నాయకులు కోండ్ర శంకర్​, వేల్పుల మల్లేశ్,  దుర్గాప్రసాద్​లు వంశీకి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. 

గోదావరిఖని: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ఎంఆర్ పీఎస్​ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని , పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఎంఆర్​పీఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య, పెద్దపల్లి పార్లమెంట్​ఇన్ చార్జి కోండ్ర శంకర్​ తెలిపారు. శనివారం గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తూ దళితుల రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మాదిగలతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు మాదిగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ముత్తారం, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు. శనివారం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దతు ధర, ఉపాధి హామీ కూలీ రూ.400 పెంచుతామన్నారు.