
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో విచిత్రమైన ఘటన జరిగింది. ధర్మవరం పట్టణానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య లాంగ్ చైన్ ను మింగేశాడు. మూడు నెలలుగా కడుపులోనే లాంగ్ చైన్ ఉంది. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. దీంతో బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి వెళ్లగా పరిశీలించిన వైద్యులకు షాక్ కుగురయ్యారు. పొట్టలో చైన్ ఉందని దానిని ఆపరేషన్ చేసి తీయాలని డాక్టర్లు తెలిపారు. వైద్యం ఖర్చు ఎస్టిమేషన్ చెప్పగా.. అంత డబ్బు పెట్టుకొనే స్థోమత లేదని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్ గా పని చేస్తున్న సుకుమార్ ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే నోటి ద్వారా పొట్టలో ఉన్న చైన్ ను బయటకు తీశాడు. చిన్న కుట్టు కూడా పడకుండా వైద్యం చేసిన డాక్టర్ సుకుమార్ కు బాధితుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.